Akash Deep: పఠాన్ అంచనా నిజమైంది.. 10 వికెట్లు తీశాడు.. టీమిండియాలో మరో షమీ !

Published : Jul 06, 2025, 11:20 PM IST

Akash Deep: టీమిండియా మాజీ స్టార్ ఇర్ఫాన్ పఠాన్ ముందే ఊహించినట్టు, బుమ్రా స్థానంలో ఆడిన ఆకాష్ దీప్ 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

PREV
16
ఇంగ్లాండ్ పై ఆకాష్ దీప్ విశ్వరూపం.. పఠాన్ అంచనా నిజమైంది

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆకాష్ దీప్ చెలరేగాడు. అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండ్ తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచింది. 

ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ గెలుపులో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో రాణించగా, బౌలింగ్ విభాగంలో ఆకాష్ దీప్ కీలక పాత్ర పోషించాడు. అతను రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, మొత్తంగా మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

26
బుమ్రా స్థానంలో భారత జట్టులోకి వచ్చిన ఆకాష్ దీప్

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా రెండో టెస్ట్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. అతని స్థానంలో బెంగాల్‌కు చెందిన ఆకాష్ దీప్‌ను భారత జట్టుకు ఎంపిక చేశారు. 

ఇదే అతనికి కీలక అవకాశంగా మారింది. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆకాష్ దీప్, మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు.

36
ఎడ్జ్‌బాస్టన్‌లో 10 వికెట్లు తీసిన భారత రెండో బౌలర్ గా ఆకాశ్ దీప్

1986లో ఈ మైదానంలో చేతన్ శర్మ 10 వికెట్లు తీశాడు. మళ్లీ ఇప్పుడు ఆకాష్ దీప్ ఈ ఘనత సాధించిన రెండవ భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 187 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. అతన అద్భుతమైన బౌలింగ్ తో భారత్ విజయంలో కీలక బౌలర్‌గా ఆకాశ్ దీప్ నిలిచాడు.

46
సెనా దేశాల్లో ఆకాశ్ దీప్ అరుదైన రికార్డు

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సెనా దేశాల్లో ఒకే టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన మూడవ భారత బౌలర్‌గా ఆకాష్ దీప్ నిలిచాడు. అతని కంటే ముందు, చేతన్ శర్మ (1986, ఇంగ్లాండ్), వేంకటేశ్ ప్రసాద్ (1996, దక్షిణాఫ్రికా) మాత్రమే ఈ ఘనత సాధించారు.

56
ఇర్ఫాన్ పఠాన్ అంచనా నిజం చేసిన ఆకాశ్ దీప్

ఇంగ్లాండ్ తో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్నట్టు వార్తలొచ్చిన సమయంలో, భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాష్ దీప్‌నే బుమ్రా స్థానంలో ఆడించాలని సూచించాడు.

ఆ సమయంలో.. "బుమ్రా లేకపోతే ఎవరు రావాలి? నెట్స్‌లో ఆకాష్ దీప్ తన ఫామ్ తో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అతను మహ్మద్ షమీ తరహా బౌలర్. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో అతని స్ట్రైట్ సీమ్ డెలివరీలు ప్రయోజనకరంగా ఉండొచ్చు. శిరాజ్, ప్రసిద్ధ్ లాంటి హిట్ ది డెక్ బౌలర్ల కంటే ఎక్కువ ప్రభావం చూపగలడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ అగ్రసివ్‌గా ఆడే సమయంలో ఇది చాలా సవాలుగా మారుతుంది. అర్షదీప్‌ను పక్కన పెడితే, బుమ్రా ఆడకపోతే ఆ స్థానానికి ఉత్తమ ఎంపిక ఆకాష్ దీప్" అని పఠాన్ పేర్కొన్నాడు.

66
షమీ తరహా ప్రదర్శన ఇచ్చిన ఆకాశ్ దీప్

ఇర్ఫాన్ పఠాన్ చెప్పినట్టుగానే, ఆకాష్ దీప్ తన బౌలింగ్ ద్వారా మహ్మద్ షమీని గుర్తు చేసే విధంగా స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌కు షాక్ ఇచ్చాడు. అతని స్వింగ్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్ ధాటిగా ఆడాలనే ప్రయత్నాలకు దెబ్బపడింది.

ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ (269, 161 పరుగులు) బ్యాటింగ్‌ను నడిపితే, బౌలింగ్ విభాగంలో ఆకాష్ దీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈ ఇద్దరూ కలిసి భారత్‌కు 336 పరుగుల ఘన విజయం అందించడంలో కీలక పాత్ర పోషించారు.

టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం 1-1 తో సమంగా ఉన్న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories