మైఖేల్ క్లార్క్‌: వరల్డ్ కప్ ఛాంపియన్ ప్లేయర్ కు క్యాన్సర్

Published : Aug 27, 2025, 07:59 PM IST

Michael Clarke Skin Cancer: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ముక్కుపై స్కిన్ క్యాన్సర్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అభిమానులకు సూచిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

PREV
15
మైఖేల్ క్లార్క్ కు చర్మ క్యాన్సర్ శస్త్రచికిత్స

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్, 2015 వరల్డ్ కప్ విజేత మైఖేల్ క్లార్క్ క్యాన్సర్ బారినపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన క్యాన్సర్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. క్లార్క్ తన ముక్కుపై క్యాన్సర్ గడ్డను తొలగించుకున్నట్లు బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

క్యాన్సర్ శస్త్రచికిత్స అనంతరం తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. “స్కిన్ క్యాన్సర్ నిజమైన ముప్పు, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో.. క్రమం తప్పకుండా చర్మ పరీక్షలు చేయించుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు ఎప్పుడూ ఉత్తమం. నాకు అయితే రెగ్యులర్ చెకప్‌లు, తొలిదశలో గుర్తింపు ప్రాణాలను కాపాడుతున్నాయి” అని పేర్కొన్నారు.

DID YOU KNOW ?
36 సెంచరీలు కొట్టిన మైఖేల్ క్లార్క్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 36 సెంచరీలు సాధించాడు. వాటిలో టెస్ట్ క్రికెట్ లో 28 సెంచరీలు, వన్డే క్రికెట్ లో 8 సెంచరీలు ఉన్నాయి.
25
2006 నుంచే మొదలైన మైఖేల్ క్లార్క్ పోరాటం

మైఖేల్ క్లార్క్‌కు తొలిసారి 2006లో స్కిన్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి పలు మార్లు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. 2019లో ఆయన నుదిటిపై ఉన్న గడ్డలను తొలగించుకున్నారు. 2023లో ఛాతిపై బేసల్ సెల్ కార్సినోమా తొలగించుకోవడానికి 27 కుట్లు వేయించుకున్నారు. గత 19 ఏళ్లుగా ఈ వ్యాధితో నిరంతర పోరాటం చేస్తున్నారు.

35
అభిమానులకు మైఖేల్ క్లార్క్ సందేశం

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా క్లార్క్ తన అనుభవాన్ని పంచుకున్నారు. “ప్రివెన్షన్ బెట్టర్ దెన్ క్యూర్. క్రమం తప్పని వైద్య పరీక్షలు, తొలిదశలో గుర్తింపు అత్యంత కీలకం. నేను నాన్నను. నా ఏడేళ్ల కూతురి కోసం బతికుండాలి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి” అని ఆయన పిలుపునిచ్చారు. అలాగే తన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన వైద్యుడు డాక్టర్ బిష్ సోలిమాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

45
మైఖేల్ క్లార్క్ క్రికెట్ కెరీర్

మైఖేల్ క్లార్క్ 2004 నుంచి 2015 వరకు ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడారు. టెస్టుల్లో 8,643 పరుగులు, వన్డేల్లో 7,981 పరుగులు చేశారు. ఆయన కెప్టెన్సీలో 2013–14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై 5–0తో విజయాన్ని సాధించారు.

2015లో వరల్డ్ కప్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2007 వరల్డ్ కప్ విజేత జట్టులో ఆటగాడిగా ఉన్న ఆయన, 2015లో కెప్టెన్‌గా మరోసారి జట్టును విజేతగా నిలిపారు.

55
ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ ముప్పు

ప్రపంచంలోనే అత్యధిక స్కిన్ క్యాన్సర్ కేసులు ఆస్ట్రేలియాలోనే నమోదవుతున్నాయి. గణాంకాల ప్రకారం 70 ఏళ్లలోపు ఆస్ట్రేలియన్లలో ఇద్దరిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశముంది. బలమైన అల్ట్రావయొలెట్ (UV) కిరణాలు, భౌగోళిక పరిస్థితులు, తెల్లని చర్మం కలిగిన జనాభా కారణంగా ఈ ప్రమాదం అధికమవుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

క్లార్క్ శస్త్రచికిత్స వార్త వెలుగులోకి రాగానే ఆటగాళ్లు, అభిమానులు ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా స్కిన్ క్యాన్సర్ ఫౌండేషన్‌తో కలిసి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్లార్క్ తన జీవితమంతా జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories