Virat kohli Rohit sharma: ఇదెక్క‌డి ట్విస్ట్ మామా.. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు కోహ్లి, రోహిత్‌.

Published : May 15, 2025, 11:12 AM IST

భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్స్ షాక్ ఇచ్చారు. ఇంగ్లండ్ టూర్ ముందు ఈ నిర్ణ‌యంతీసుకోవ‌డం మ‌రింత షాక్‌కి గురి చేసింది. అయితే ఇదే స‌మ‌యంలో క్రికెట్ అభిమానుల‌కు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.   

PREV
15
Virat kohli Rohit sharma: ఇదెక్క‌డి ట్విస్ట్ మామా.. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు కోహ్లి, రోహిత్‌.

టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరలో జట్టుతో కలిసి ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. IPL 2025 ముగిసిన అనంతరం జూన్ 20న ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌తో భారత్ తన డబ్ల్యూటీసీ 2025–27 సైకిల్‌ను ప్రారంభించనుంది.

25

ఈ సిరీస్‌కు ముందు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం భారత క్రికెట్ వర్గాల్లో ఊహించని పరిణామంగా మారింది. రోహిత్ శర్మకు సెలెక్షన్‌కు సంబంధించి స్పష్టత లేకపోవడంతోనే ఆయన టెస్ట్ క్రికెట్‌ను వదిలారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం ఇష్ట పూర్వ‌కంగానే టెస్ట్ మ్యాచ్‌ల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లు తెలుస్తోంది. 
 

35

ఈ పరిస్థితుల్లో, BCCI వీరిద్దరినీ ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపించాలనే ఆలోచనలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. లీడ్స్ వేదికగా జూన్ 20న మొదలయ్యే టెస్ట్‌కు కోహ్లీ, రోహిత్‌ల‌కు ఆహ్వానం అందించి వారిని గౌరవించేందుకు గ్రౌండ్‌లో గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. వారు భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

45

బీసీసీఐలోని ఓ సీనియర్ అధికారి ప్రకారం, వీరిద్దరినీ ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. మాజీ లెజెండ్ అనిల్ కుంబ్లే ఇప్పటికే బీసీసీఐకి వీరిద్దరికీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలంటూ సూచనలు ఇచ్చారు. అభిమానులు కూడా కోహ్లీ, రోహిత్ వంటి మహా క్రికెటర్లు సైలెంట్‌గా గేమ్ నుంచి నిష్క్రమించడం న్యాయంగా లేదని అభిప్రాయపడుతున్నారు.

55

ఇదే విష‌య‌మై భార‌త మాజీ క్రికెట‌ర్ అనిల్ కుంబ్లే సైతం స్పందించారు. ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ, తరువాత విరాట్ కోహ్లీ టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పారు. వీళ్లిద్దరికీ మైదానంలో గొప్ప వీడ్కోలు దక్కాల్సింది. ఇది సోషల్ మీడియా యుగమే అయినా, అభిమానులు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండాల్సింది. అలాంటి తరుణం వారికి దక్కకపోవడంపై సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది,” అని కుంబ్లే అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories