SRH IPL 2025: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కు కారణమేంటి?

Published : May 15, 2025, 12:07 AM IST

SRH IPL 2025: ఐపీఎల్ 2024 రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఈసారి కేవలం 3 విజయాలతో ప్లేఆఫ్స్‌కు అర్హత కూడా సాధించ‌లేక‌పోయింది. ఐపీఎల్ 2025 లో తీవ్రంగా నిరాశ‌ప‌ర్చింది. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కు కార‌ణ‌మేంటి?  

PREV
15
SRH IPL 2025: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కు కారణమేంటి?

why Sunrisers Hyderabad failed in IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. ఐపీఎల్ 2025 సీజన్‌లో మాత్రం తీవ్రంగా  నిరాశ ప‌రిచింది. భారీ అంచ‌నాలున్న హైద‌రాబాద్ టీమ్ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది.

ఐపీఎల్ 2025 మొదటివారంలో ఘన విజయం సాధించినప్పటికీ, తరువాతి మ్యాచ్‌లలో చెత్త‌ ప్రదర్శనల‌తో ఓటములు ఎదుర్కొంది. ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ రేస్ నుంచి SRH అవుట్ అయింది. హైద‌రాబాద్ టీమ్ ఫ్లాప్ షో కు కార‌ణాలు గ‌మ‌నిస్తే.. 

25

1. మ్యాచ్ ప‌రిస్థితిలో సంబంధం లేకుండా దూకుడుగా ఆడ‌టం 

రాజస్థాన్ రాయల్స్‌పై 286/6 స్కోర్ చేసి ఐపీఎల్ 2025 సీజన్‌ను హైద‌రాబాద్ టీమ్ అద్భుతంగా ప్రారంభించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్‌లు 300 పరుగులను అందుకోవ‌డం కోసం దూకుడుగా ఆడ‌తామ‌ని స్పష్టంగా చెప్పారు. అయితే అదే దూకుడు స్ట్రాటజీ తరచుగా వికెట్లను కోల్పోయేందుకు దారితీసింది. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడకపోవడం వల్ల టీమ్ నిలకడ కోల్పోయింది. జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌పై ప్ర‌భావం ప‌డింది. 

35

2. ఓపెనింగ్ జోడీ నిరాశపర్చింది 

ఐపీఎల్ 2024లో అత్యంత విజ‌య‌వంత‌మైన జోడీగా కొన‌సాగిన ట్రావిస్ హెడ్ - అభిషేక్ శర్మ జోడీ ఐపీఎల్ 2025 సీజన్‌లో నిరాశపరిచింది. ఇద్దరూ ఈ సీజన్‌లో సగటున 32కంటే తక్కువ పరుగులు మాత్రమే చేశారు. వారి భాగస్వామ్యం సగటు కేవలం 36 పరుగులు. ఎక్కువగా ఒకే ఒక్కసారి 50+ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. పరుగుల రేట్ (10+ ఓవర్‌కు) ఉన్నప్పటికీ, స్థిరత లేకపోవడం జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపించింది.

45

3. మిడిలార్డర్‌లో కేవలం క్లాసెన్ ఒక్క‌డే

హైన్రిచ్ క్లాసెన్ (311 పరుగులు) మినహా హైద‌రాబాద్ టీమ్ మిడిలార్డర్ పూర్తి విఫలమైంది. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ, తరువాత 9 ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే 20 పరుగుల మార్క్‌ను దాటాడు. నితిష్ కుమార్ రెడ్డి సగటు 24.71, అనికేత్ వర్మలో ప్రతిభ కనిపించినా స్థిరత లేకపోయింది.

55

4. బౌలింగ్ ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు

కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రదర్శన చెప్పుకోద‌గ్గ స్థాయిలో లేదు. స్టార్ పేస‌ర్ మహ్మద్ షమీ కూడా  బౌలింగ్ లో స‌క్సెస్ కాలేదు. హర్షల్ పటేల్ వికెట్లు తీసినా, పరుగులు అధికంగా ఇవ్వ‌డం జ‌ట్టు విజ‌యంపై ప్ర‌భావం చూపుతోంది. మంచి స్పిన్నర్  లేక‌పోవ‌డం కూడా హైద‌రాబాద్ టీమ్ బౌలింగ్ ను ప్ర‌భావితం చేసింది. అడ‌మ్ జంపా గాయం జ‌ట్టును దెబ్బ‌కొట్టింది. 

Read more Photos on
click me!

Recommended Stories