8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డ్

Published : Oct 14, 2025, 01:01 AM IST

India West Indies Test: భారత్-వెస్టిండీస్ రెండో టెస్ట్ నాలుగో రోజు అరుదైన రికార్డు సాధించింది. సూపర్ కమ్ బ్యాక్ తో వెస్టిండీస్ మ్యాచ్ ను ఐదో రోజువరకు తీసుకెళ్లింది. 10వ వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యంతో విండీస్ కొత్త రికార్డు సృష్టించింది.

PREV
16
భారత-వెస్టిండీస్ రెండో టెస్ట్‌లో అరుదైన సంఘటన

భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు చరిత్ర సృష్టించింది. 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత నమోదైంది. వెస్టిండీస్ చివరి వికెట్ జోడీ జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ అద్భుతంగా ఆడుతూ భారత బౌలర్లను ఆశ్చర్యపరిచారు. ఈ ఇద్దరు ప్లేయర్లు కలిసి 10వ వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి అరుదైన రికార్డు సృష్టించారు.

26
10వ వికెట్ భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించిన విండీస్

2017 తర్వాత ఇది మొదటిసారి టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యర్థి జట్టు చివరి వికెట్‌కు 50 పరుగులకుపైగా భాగస్వామ్యం నమోదు చేసిన సందర్భంగా నిలిచింది. 2010లో మోయ్సెస్ హెన్రిక్స్, నాథన్ లియాన్ జంట భారత్‌పై చెన్నై టెస్టులో 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత 2017లో పుణేలో మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ జంట 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇప్పుడు 2025లో ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో సీల్స్, గ్రీవ్స్ జోడీ 79 పరుగులతో ఆ రికార్డులను అధిగమించింది.

36
గతంలో భారత్‌పై 10వ వికెట్ భాగస్వామ్య రికార్డులు

భారత్‌పై 10వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాల్లో 1962లో సర్ ఫ్రాంక్ వారెల్, వెస్లీ హాల్ 98* పరుగులు చేశారు. 2000లో ఆండీ ఫ్లవర్, హెన్రీ ఓలొంగా 97* పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 1987లో ఇమ్రాన్ ఖాన్, తౌసీఫ్ అహ్మద్ జంట 81 పరుగులు సాధించారు. ఇప్పుడు సీల్స్, గ్రీవ్స్ జంట 79 పరుగులతో ఈ లిస్టులో చేరారు.

46
హోప్, క్యాంప్‌బెల్‌ల సెంచరీల మోత

విండీస్ జట్టు ఫాలోఆన్ ఆడుతూ అద్భుత పోరాటం చేసింది. షాయ్ హోప్ (115 పరుగులు), జాన్ క్యాంప్‌బెల్ (103 పరుగులు) సెంచరీలు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యంతో భారత్ బౌలర్లను బెంబేలెత్తించారు. క్యాంప్‌బెల్ తన సెంచరీ నాక్ లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో చక్కటి బ్యాటింగ్ చేశాడు. హోప్ 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. జడేజా క్యాంప్‌బెల్‌ను అవుట్ చేసి ఆ జంటను విడగొట్టగా, తర్వాత షాయ్ హోప్ - రోస్టన్ చేజ్ జంట మరో 59 పరుగులు చేసింది. దీంతో విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసింది.

56
విజయానికి చేరువగా భారత్

భారత్ జట్టు విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 స్కోరుతో డిక్లేర్ చేసింది. విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 248 పరుగులు చేసి ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 390 పరుగులు సాధించి భారత్‌కు 121 పరుగుల టార్గెట్ ఇచ్చింది.

నాల్గో రోజు ముగిసే సరికి భారత్ 63/1 పరుగులతో ఆడుతోంది. యశస్వి జైస్వాల్ (8) త్వరగా అవుట్ కాగా, కేఎల్ రాహుల్ (25* పరుగులు), సాయి సుదర్శన్ (30* పరుగులు) క్రీజ్‌లో ఉన్నారు.

66
బుమ్రా, కుల్దీప్ మెరుపులు

భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తలా మూడు వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ సాధించారు. విండీస్ 311/9 పరుగుల వద్ద వుండగా, గ్రీవ్స్- సీల్స్ జోడీ అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది. ఈ జంట 79 పరుగులు జోడించి విండీస్ టార్గెట్‌ను 100 రన్స్ దాటేలా చేసింది. అలాగే, ఈ జోడీని విడదీయడం భారత్ బౌలర్లకు పెద్ద సవాల్‌గా కూడా మారింది.

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్‌కు ఇది మొదటి టెస్ట్ సిరీస్ గెలుపు అవుతుంది. విండీస్ బలంగా పోరాడినా, భారత్ విజయానికి కేవలం కొన్ని పరుగుల దూరంలో ఉంది. ఐదవ రోజు భారత్ విజయంతో 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయనుంది.

Read more Photos on
click me!

Recommended Stories