Jasprit Bumrah
ICC Shock for Jasprit Bumrah: 5 టెస్టు సిరీస్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ ఓటమి నుంచి బయటకు రాకముందే, మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డాడనీ, లెవల్-1 ప్రకారం అతడిని దోషిగా తేల్చింది.
హైదరాబాద్ టెస్టు సందర్భంగా క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ బుమ్రాకు ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. ఇంగ్లండ్ క్రికెటర్ ఓటీ పోప్ రన్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఉద్దేశపూర్వకంగానే బుమ్రా అడ్డుతగిలాడని ఐసీసీ మందలించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం బుమ్రా చేసిన నేరం లెవల్ 1 నేరంగా పేర్కొంది.
Jasprit Bumrah
ఈ నియమాలు ఉల్లంఘించడంతో బుమ్రాను మందలించడం, 24 నెలల వ్యవధిలో బుమ్రా చేసిన మొదటి నేరం కావడంతో అతని క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ ను విధిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. బుమ్రా కూడా తన ఉల్లంఘనను అంగీకరించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Jasprit Bumrah
ఏదైనా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో ఆటగాడు, సహాయక సిబ్బంది, అంపైర్, మ్యాచ్ రిఫరీ లేదా ఇతర వ్యక్తితో (ప్రేక్షకులతో సహా) అనుచితంగా భౌతిక తాకిడికి పాల్పడితే విధించే ఐసీసీ నిబంధనలు ఆర్టికల్ 2.12 ప్రకారం బుమ్రాను దోషిగా నిర్ధారించారు.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 81వ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ కు బుమ్రా అడ్డురావడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఇంగ్లాండ్ ప్లేయర్ ఓలీ పోప్ కు అడ్డుగా నిలిచినందుకు బుమ్రాను ఐసీసీ మందలించి డీమెరిట్ పాయింట్ విధించింది.