రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. !

First Published | Jan 26, 2024, 2:08 PM IST

Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. మ‌రోసారి ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికతో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. నాలుగోసారి ఈ అవార్డును  గెలుచుకున్న తొలి ప్లేయ‌ర్ గా చ‌రిత్ర‌కెక్కాడు.
 

Virat Kohli

ICC ODI Cricketer of the Year Virat Kohli: భార‌త లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట మరో ఘనత చేరింది. 2023 సంవత్సరానికి గాను ఐసీసీ ప‌రుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచి.. ఇప్ప‌టికే అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు.

Rohit Sharma, Virat Kohli, Rinku Singh

ఐసీసీ ప‌రుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా విరాట్ కోహ్లీ ఎంపిక కావ‌డం ఇది నాలుగో సారి. ఇప్ప‌టికే మూడు సార్లు ఈ అవార్డులు అందుకున్న నాల్గొసారి వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా నిలిచి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. 


ఈ క్ర‌మంలోనే దిగ్గ‌జ క్రికెట్ ప్లేయ‌ర్ల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులో ఏబీ డివిలియర్స్ ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. విరాట్ కోహ్లీకి నాలుగోసారి ఈ అవార్డు దక్కింది. ఇదివ‌ర‌కు 3 సార్లు ఈ అవార్డు ఏబీ డివిలియర్స్ అందుకున్నాడు. 

విరాట్ కోహ్లీ 2023లో క్రికెట్ ప్రపంచంలో అద్భుత ప్రదర్శన చేశాడు. అందుకే వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా ఎంపిక చేసిన‌ట్టు ఐసీసీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా గ‌తేడాది జ‌రిగిన ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో విరాట్ కోహ్లీ త‌న బ్యాట్ తో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. 

Virat Kohli,Sachin Tendulkar

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. 2003లో క్రికెట్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉండగా, 2023లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Virat Kohli

ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ అద‌ర్భుత‌మైన ఆట‌తో అల‌రించాడు. 11 మ్యాచ్ ల‌లో ఆడి 765 పరుగులు చేశాడు. ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 టోర్న‌మెంట్ లో కోహ్లీ సగటు 95.62, స్ట్రైక్ రేట్ 90.31 గా ఉంది. ఈ టోర్నమెంట్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో ఒక సెంచరీతో పాటు మూడు సెంచరీలు సాధించాడు.

2023లో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 36 అంతర్జాతీయ ఇన్నింగ్స్ ల‌లో 2,048 పరుగులు చేశాడు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో టాప్ స్కోరర్ గా, భారతదేశం చివరి ఓటమి పాలైనప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ టైటిల్ ను గెలుచుకున్నాడు. 

Virat Kohli

అలాగే, ప్రపంచకప్ లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. 50 ఓవర్ల క్రికెట్లో 50 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

Latest Videos

click me!