ఐపీఎల్ 2025 వేలం: రిషబ్ పంత్ నుండి శ్రేయాస్ అయ్యర్ వరకు.. టాప్-6 ఖరీదైన ఆటగాళ్ళు వీరే

First Published | Nov 24, 2024, 9:50 PM IST

top 6 most expensive players in IPL : ఐపీఎల్ 2025 మెగా వేలం రికార్డు స్థాయిలో జరిగింది. రిషబ్ పంత్ 27 కోట్ల రూపాయలతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ 26.75 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో నిలిచాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం ప్రస్తుతం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో జరుగుతున్న ఈ రెండు రోజుల కార్యక్రమంలో 577 మంది ఆటగాళ్ళు ఈ ప్రముఖ లీగ్‌లో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఆదివారం జరిగిన వేలంలో భారత ప్లేయర్లు రికార్డు ధరలు పలికారు. మరీ ముఖ్యంగా పలు టీమ్స్ వదులుకున్న ప్లేయర్లపై ఇతర జట్లు కాసుల వర్షం కురిపించాయి. ఈ వేలంలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17 సంవత్సరాల చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-6 ఆటగాళ్ల  ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబైకి జాక్‌పాట్: ₹25 కోట్ల ప్లేయర్ ను ₹8 కోట్లకే కొట్టేసింది !

రిషబ్ పంత్

27 కోట్లకు రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసి లక్నో సూపర్ జెయింట్ చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. కొద్ది నిమిషాల క్రితం శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. వెంటనే అతని రికార్డు బద్దలైంది. లక్నో జట్టు ఆరంభం నుంచి పంత్‌ కోసం దూకుడు ప్రదర్శించింది.

మొదటి బిడ్ వేసింది కూడా ఆ జట్టే. పంత్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా పోటీ పడ్డాయి. అయితే, ఈ రెండు జట్లు వెనుకడుగు వేయడంతో రంగంలోకి దిగిన ఢిల్లీ టీమ్ ఆర్టీఎం ఉపయోగించింది. దీంతో లక్నో టీమ్ మరొక వేలం వేయవలసి వచ్చింది. 27 కోట్లకు వేలం వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఢిల్లీ తన RTM కార్డును తీసివేయడంతో పంత్ లక్నో జట్టులోకి వెళ్లాడు.

సూప‌ర్ సెంచ‌రీతో రికార్డుల మోత మోగించిన విరాట్ కోహ్లీ

Latest Videos


శ్రేయాస్ అయ్యర్

ఐపీఎల్ 2025 వేలంలో శ్రేయాస్ అయ్యర్ కోసం పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా వేలం వేసింది. పంజాబ్ కింగ్స్ అతనికి గట్టిపోటీనిచ్చింది. 7 కోట్ల తర్వాత పంజాబ్ బిడ్ నుండి వైదొలిగింది. ఆ తర్వాత కోల్‌కతా, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు మొదలైంది. 9.75 కోట్ల వరకు కోల్‌కతా వేలం వేసింది. ఢిల్లీ జట్టు అతడిని రూ.10 కోట్లకు కొనుగోలు చేస్తుందని అనిపించినా పంజాబ్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య పోటీ మొదలైంది. పంజాబ్ అతడిని రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టాడు శ్రేయాస్ అయ్య‌ర్. గత సీజన్ వేలంలో స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఆ త‌ర్వాత కొద్ది స‌మ‌యంలోనే రిష‌బ్ పంత్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. 

ఐపీఎల్ 2025 వేలం: 177 శాతం పెరిగిన యుజ్వేంద్ర చాహల్ ధర.. పంజాబ్ కింగ్స్ లోకి భారత స్టార్ స్పిన్నర్

మిచెల్ స్టార్క్

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్  2023లో 24.75 కోట్ల రూపాయలకు కోల్‌కతా నైట్ రైడర్స్‌ టీమ్ లోకి వెళ్లాడు. దీంతో ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. అయితే, ఈ వేలంలో ఆ స్థాయి ధర అతనికి రాలేదు.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. 11.75 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. గతసారి స్టార్క్ రూ.24.75 కోట్లకు అమ్ముడుపోయాడు. స్టార్క్ కోసం ముంబై రూ.6.25 కోట్ల వరకు వేలం వేసింది. దీని తర్వాత కోల్‌కతా రూ.10 కోట్ల వరకు వేలం వేసింది. ఇక్కడి నుంచి ఢిల్లీ, ఆర్‌సీబీ మధ్య ఫైట్ కనిపించింది. ఆర్సీబీని ఓడించిన ఢిల్లీ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది.

టీ20 క్రికెట్‌లో హ్యాట్రిక్ సెంచరీలు.. తిలక్ వర్మ ప్రపంచ రికార్డు

వెంక‌టేష్ అయ్యర్

2025 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారత ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేయడానికి చూసే క్ర‌మంలో వెంకటేష్ అయ్యర్ కోసం బిగ్ ఫైట్ చేశాయి. వేలంలో అత‌ని కోసం రికార్డు ధ‌ర‌ను చూప‌డం క్రికెట్ అభిమానులకు పెద్ద ఆశ్చర్యం క‌లిగించింది. 23.75 కోట్ల భారీ మొత్తానికి కేకేఆర్ అత‌న్ని ద‌క్కించుకుంది. దీంతో ఐపీఎల్ 2025 వేలంలో అత్యంత ఖ‌రీదైన మూడో ప్లేయ‌ర్ గా నిలిచాడు. మొత్తంగా అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో నాల్గవ అత్యంత ఖరీదైన కొనుగోలుగా నిలిచాడు.
 

పాట్ కమిన్స్

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నాల్గవ ఖరీదైన ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని 20.50 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. గత ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను అద్భుతంగా ముందుకు నడిపించాడు ఈ కంగారు టీమ్ కెప్టెన్. సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఫైనల్ వరకు నడిపించాడు. అయితే, ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. 

సామ్ కరన్

పంజాబ్ కింగ్స్ 2023లో సామ్ కరన్‌పై 18.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అతని సేవలను పొందింది. అతను ప్రస్తుతం 5వ ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. 

యంగ్ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ అతనిని రూ. 18.50 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు అత్యధిక IPL బిడ్‌లలో ఒకటిగా చరిత్ర సృష్టించాడు. అతని అద్భుత‌మైన బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యంతో ప్ర‌త్యేక గుర్తింపు సాధించాడు. దీంతో అత‌ని కోసం చాలా టీమ్స్ పోటీ ప‌డ‌టంతో పంజాబ్ రికార్డు ధ‌ర‌తో అత‌న్ని ద‌క్కించుకుంది. 

అర్ష్ దీప్ సింగ్

పంజాబ్ కింగ్స్ అర్ష్‌దీప్ సింగ్‌ను 18 కోట్ల రూపాయలకు దక్కించుకుంది, దీంతో అతను మూడవ అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాడిగా, ఐపీఎల్ వేలం చరిత్రలో ఆరవ స్థానంలో నిలిచాడు.

click me!