యుజ్వేంద్ర చాహల్ ముంబై ఇండియన్స్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) లో కీలక ప్లేయర్ గా మారాడు. అలాగే, రాజస్థాన్ రాయల్స్ తరపున కూడా రెండు సీజన్లు ఆడాడు. రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. పీబీకేఎస్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో నాల్గవ జట్టు.
IPL లో యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన బౌలింగ్ రికార్డులు కలిగి ఉన్నాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మాత్రమే కాదు 200+ వికెట్ల మార్కును అందుకున్న తొలి ప్లేయర్ కూడా అతనే. 160 మ్యాచ్‌లలో చహల్ 7.84 ఎకానమీతో 205 వికెట్లు పడగొట్టాడు. ఆరుసార్లు 4 వికెట్లు, ఒకసారి 5 వికెట్లు తీసుకున్నాడు. 2022లో రాయల్స్ ఫైనల్‌కు చేరినప్పుడు చహల్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.
ముంబైకి జాక్‌పాట్: ₹25 కోట్ల ప్లేయర్ ను ₹8 కోట్లకే కొట్టేసింది !