INDW vs PAKW: స‌త్తా చాటిన‌ అమ్మాయిలు.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా

Published : Jun 14, 2026, 10:47 PM IST

INDW vs PAKW: మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ జట్టు పాకిస్థాన్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత మహిళల జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

PREV
14
స్మృతి మంధాన అర్ధశతకంతో భారీ స్కోరు

టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో షెఫాలి వర్మ త్వరగా ఔటైనా, స్మృతి మంధాన బాధ్యత తీసుకుని పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. మంధాన 44 బంతుల్లో 68 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 36 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని నిర్మించింది. చివర్లో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లో 34 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచింది. దీంతో నిర్దిష్ట 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

24
పాకిస్థాన్ బౌలర్లలో సాదియా, ఫాతిమా రాణింపు

భారత బ్యాటర్ల దూకుడును పూర్తిగా అడ్డుకోలేకపోయినా, పాకిస్థాన్ తరఫున సాదియా ఇక్బాల్, కెప్టెన్ ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు తీశారు. తస్మియా రుబాబ్, రమిన్ షమీమ్ తలో వికెట్ సాధించారు. అయితే మధ్య ఓవర్లలో వికెట్లు తీసినా భారత జట్టును తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో పాకిస్థాన్ బౌలర్లు విఫలమయ్యారు. చివరి ఓవర్లలో రిచా ఘోష్ దూకుడుగా ఆడటంతో భారత్ 170 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు షాక్‌లు

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ మునీబా అలీ మాత్రమే కొంతసేపు పోరాడి 41 పరుగులు చేసింది. ఆమె తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గుల్ ఫిరోజా, ఆయేషా జఫర్ చెరో 12 పరుగులు చేయగా, అలియా రియాజ్ 18 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించింది. కానీ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 17 ఓవర్లలోనే పాకిస్థాన్ జట్టు 106 పరుగులకు ఆలౌట్ అయింది.

34
దీప్తి శర్మ విధ్వంసం.. పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది

భారత బౌలింగ్ దళంలో స్టార్ ప్రదర్శన దీప్తి శర్మదే. ఆమె కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. శ్రీ చరణి కూడా రెండు వికెట్లు సాధించి పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచింది. షెఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా వ్యవహరించి కీలక క్యాచ్‌లు అందుకున్నారు. దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా నిలిచింది.

44
ప్రపంచకప్‌లో భారత్‌కు ఆత్మవిశ్వాసాన్నిచ్చిన విజయం

దాయాది జట్టుపై సాధించిన ఈ ఘన విజయం భారత మహిళల జట్టుకు టోర్నీలో భారీ ఆత్మవిశ్వాసాన్ని అందించింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్ రాణించగా, బౌలింగ్‌లో దీప్తి శర్మ పంజా విసిరింది. 64 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్, టైటిల్ రేసులో తమ బలాన్ని మరోసారి నిరూపించింది. జట్టు అన్ని విభాగాల్లో రాణించ‌డం అభిమానుల్లో ప్రపంచకప్ ఆశలు మరింత పెరిగేలా చేశాయి.

Read more Photos on
click me!

Recommended Stories