
ధర్మశాలలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ.. ఒక ఇంట్రెస్టింగ్ రన్ అవుట్ డ్రామా ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య జరిగిన ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రోహిత్ శర్మ రన్ అవుట్ అయ్యాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా సైలెన్స్ నెలకొంది. దీనిపై మ్యాచ్ ముగిసిన తర్వాత శుభ్‌మన్ గిల్ స్పందిస్తూ అసలు నిజాలు బయటపెట్టాడు.
ఈ మ్యాచ్ చూస్తున్న అభిమానులకు 2024లో మొహాలీలో జరిగిన టి20 మ్యాచ్ గుర్తొచ్చింది. అప్పట్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా గిల్ వల్ల ఇలాగే డకౌట్ రూపంలో రన్ అవుట్ అయ్యాడు. అప్పుడు గ్రౌండ్‌లోనే రోహిత్ గిల్‌పై గట్టిగా అరిచేశాడు. ఇప్పుడు ధర్మశాలలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మ్యాచ్‌లో 6వ ఓవర్ నాల్గో బంతికి రోహిత్ షాట్ ఆడి సింగిల్ కోసం పిలిచాడు. గిల్ కూడా రెండడుగులు ముందుకు వేసి వద్దంటూ వెనక్కి వెళ్లాడు. అప్పటికే రోహిత్ పిచ్ మధ్యలోకి వచ్చేయడంతో అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బాల్‌ను కీపర్‌కు విసరడం, రోహిత్ అవుట్ కావడం జరిగిపోయాయి. రోహిత్ కోపంగా, తీవ్ర నిరాశతో డగౌట్‌కు చేరాడు.
A painful moment for Rohit Sharma as he walked back after the run-out. 💔 pic.twitter.com/gtEG8MyguV
— manu (@manu18virat) June 13, 2026
రోహిత్ అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా సీరియస్‌గా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ గిల్ మాత్రం అసలు మ్యాటర్ చెప్పి అందరినీ కూల్ చేశాడు. "రోహిత్ భాయ్‌కి ఈ రన్ అవుట్‌పై ఎలాంటి కోపం లేదు. తను డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాక రిప్లే చూశాడు. అంతా ఓకే అని చెప్పాడు. పోయినసారి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాగే రన్ అవుట్ అయ్యానని నవ్వేశాడు" అంటూ గిల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 16 బంతుల్లో 16 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.
🚨 Heated Moment Between Rohit Sharma and Shubman Gill:
- Rohit Sharma pushed for a single.
- Rohit and Shubman Gill both started running.
- Shubman Gill collided with Allah Ghazanfar.
- Shubman denied the single when Rohit was already halfway down the pitch.
- Rohit tried his… pic.twitter.com/VarrQ8aOMS— Indian Cricket Ministry (@ICM_News45) June 13, 2026
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో బరిలోకి దిగడం ద్వారా వన్డే క్రికెట్‌లో భారత్ తరపున ఆడిన అత్యంత వయస్కుడైన ఆటగాడిగా రోహిత్ రికార్డు క్రియేట్ చేశాడు.
గత 37 ఏళ్లుగా ఉన్న మోహిందర్ అమర్‌నాథ్ (39 ఏళ్ల 36 రోజులు) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. అంతేకాదు, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ (16,119 రన్స్) మాత్రమే ఈ క్లబ్‌లో ఉన్నాడు.
Scaling Mt. 16,000 🗻
A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡
Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg— BCCI (@BCCI) June 13, 2026
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 84 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచి టీమిండియాను గెలిపించాడు. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లో కూడా స్లిప్‌లో ఒక చేత్తో సూపర్‌మ్యాన్ లాంటి క్యాచ్ పట్టి అందరినీ షాక్‌కు గురిచేశాడు.
దీనిపై గిల్ మాట్లాడుతూ.. "నా ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ బెస్ట్ క్యాచ్ లేదు. అందుకే దీనికోసం చాలా ప్రాక్టీస్ చేశాను. ఈ రోజు అది వర్కవుట్ అయినందుకు హ్యాపీగా ఉంది" అని చెప్పాడు. గిల్‌తో పాటు ఇషాన్ కిషన్ (34 రన్స్), కెఎల్ రాహుల్ (39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
Practice makes perfect 🫴🙌
🎥 Captain Shubman Gill on THAT stunning one-handed catch in the slips today 🫡
Scorecard ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/oPo4gCnj6F— BCCI (@BCCI) June 13, 2026
అంతకుముందు వర్షం పడడం వల్ల ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్‌లో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఫైరింగ్ సెంచరీ (51 బంతుల్లో 102 రన్స్) చేసినా లాభం లేకుండా పోయింది. 24.5 ఓవర్లలో 194 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఇండియా బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా.. డెబ్యూ ప్లేయర్స్ గురూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లతో ఆఫ్ఘనిస్తాన్ నడుం విరిచారు. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా, రెండో వన్డే మ్యాచ్ జూన్ 17 బుధవారం లక్నోలో జరగనుంది.