
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో, భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు రెండవ టెస్టులో కూడా చోటు దక్కలేదు. మొదటి టెస్టులో కుల్దీప్‌కు అవకాశమొస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ కుల్దీప్ కు ఛాన్స్ ఇవ్వలేదు. తొలి మ్యాచ్ పై ఇది తీవ్ర ప్రభావం చూపించింది.
ఇక రెండో మ్యాచ్ తో జట్టులోకి వస్తాడని భావించారు కానీ, వాషింగ్టన్ సుందర్‌ను ఎంచుకోవడం ద్వారా కుల్దీప్‌కు ఛాన్స్ రాలేదు. ఈ నిర్ణయంపై కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. "కుల్దీప్‌ను ఆడించాలనే అంశం ఉంది. కానీ, బ్యాటింగ్‌లో మరింత సపోర్ట్ కావాలనే ఉద్దేశంతోనే వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేశాం" అని చెప్పారు.
భారత బౌలింగ్ దళానికి నేతృత్వం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రా రెండవ టెస్టులో నుంచి విశ్రాంతి తీసుకున్నారు. శుభ్ మన్ గిల్ వెల్లడించిన ప్రకారం, ఇది వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా తీసుకున్న నిర్ణయం.
"మూడో టెస్టు లార్డ్స్ వేదిక కావడంతో బౌలర్లకు కొంత సహాయంగా ఉండొచ్చు అనిపించింది. అందుకే బుమ్రాను అక్కడ ఆడించాలనుకుంటున్నాం" అని గిల్ పేర్కొన్నాడు.
గతంలో టీమిండియా కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "ప్రపంచంలోనే ఉత్తమ ఫాస్ట్ బౌలర్‌ను, ఏడు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ విశ్రాంతికి పంపడం అర్థంలేని విషయం" అని శాస్త్రి స్కైస్పోర్ట్స్ తో అన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా మద్దతు ఇచ్చారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ఫామ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ, అతన్ని ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఎడ్జ్‌బాస్టన్ వేదిక స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది, కుల్దీప్ ను ఎంపిక చేయకపోవడం అన్యాయమని సునీల్ గవాస్కర్ అన్నారు.
"ఈ పిచ్‌లో మరింత టర్న్ ఉండవచ్చని అందరూ చెబుతున్నారు. బ్యాటింగ్‌లో 830 పరుగులు చేసిన జట్టుకు, బౌలింగ్ విఫలం కావడం అసలు సమస్య. కుల్దీప్‌కు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది" అని గవాస్కర్ సోనీ స్పోర్ట్స్ తో అన్నారు.
స్పిన్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై కుల్దీప్ యాదవ్ ను ఆడించకపోవడం భారత జట్టు అవకాశాలను దెబ్బతీసే అంశంగా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తప్పకుండా గెలిచిన సిరీస్ ను కొనసాగించాలని చూస్తున్న భారత్ కుల్దీప్ ను జట్టులోకి తీసుకోకుండా మళ్లీ తప్పు చేసిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇంగ్లాండ్ తమ ‘బాజ్‌బాల్’ శైలితో టెస్టు క్రికెట్‌ను వేగంగా మార్చేస్తోంది. ఎక్కువ రన్‌రేట్‌తో ఎదురైనా ప్రతిస్పర్థుల్ని గెలవనివ్వకుండా కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, స్పెషలిస్ట్ బౌలర్ అయిన కుల్దీప్‌ను ఎంపిక చేయకపోవడం భారత జట్టు గెలుపు అవకాశాలపై కొంత ప్రభావం చూపవచ్చు.
ఎడ్జ్‌బాస్టన్‌లో విదేశీ పేసర్లు అత్యధికంగా 4.96 ఎకానమీ రేట్ ను కలిగి ఉన్నారు. విదేశీ స్పిన్నర్ల విషయానికి వస్తే బెస్ట్ స్ట్రైక్‌రేట్ 55.1, తక్కువ బౌలింగ్ సగటు 29 గా ఉంది. కుల్దీప్ vs ఇంగ్లాండ్ గణాంకాలు గమనిస్తే.. ఇంగ్లాండ్ స్పిన్ కు వ్యతిరేకంగా 30.5 సగటుతో ఆడింది. ఇందులో 51 వికెట్లలో కుల్దీప్ 19 వికెట్లు తీసి, 20.6 సగటు, 36 స్ట్రైక్‌రేట్‌తో మెరిశాడు.
• బ్యాట్స్‌మెన్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్ మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్
• ఆల్‌రౌండర్లు: నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్
• బౌలర్లు: ముహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ (డెబ్యూట్), ప్రసిద్ధ్ క్రిష్ణ
• జట్టు నుంచి ఔట్ అయిన వారు: జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సాయ్ సుదర్శన్
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
భారత్ టెస్ట్ జట్టులో స్పెషలిస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్‌ను వదిలేసి, బ్యాటింగ్‌లో లోతును ప్రాధాన్యతనిచ్చిన నిర్ణయం పెద్ద ప్రశ్నగా మారింది. ఇది సరైన నిర్ణయమా లేక తప్పుడు అంచనాన అనేది ఈ టెస్ట్ ఫలితంతో తేలనుంది.