india vs england: ఇంగ్లాండ్ పై గెలుపు.. చరిత్ర సృష్టించిన భార‌త్

Published : Jul 06, 2025, 09:42 PM IST

India vs England: భారత్ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జ‌రిగిన‌ రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ పై విక్ట‌రీ కొట్టింది.

PREV
15
ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టిన భారత్

India vs England: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భార‌త్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఇంగ్లాండ్ పై సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ విజ‌యంలో మొద‌ట బ్యాట‌ర్లు, చివ‌రి రోజు బౌల‌ర్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో మెరిశారు. శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్సీలో భార‌త్ కు తొలి టెస్టు విజ‌యం ఇది. అది కూడా బ‌ల‌మైన ఇంగ్లాండ్ జ‌ట్టుపై, గ‌తంలో ఎప్పుడు గెల‌వ‌ని ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌పై గిల్ సేన జ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌డం విశేషం.

25
భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించింది

భారత జట్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్‌పై 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ చరిత్రలో ఇదే భారత్‌కు ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి గెలుపు కావడం గమనార్హం.

ఈ విజయానికి ప్రధాన కారణం గిల్ బ్యాటింగ్ తో పాటు ఆకాష్ దీప్ సూప‌ర్ బౌలింగ్. తన కెరీర్‌లోనే తొలిసారి ఆకాష్ దీప్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 271 పరుగులకే ఆలౌట్ చేశాడు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమం చేసింది.

35
ఇండియా - ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ వివరాలు

భారత తొలి ఇన్నింగ్స్:

భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 269 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 89 పరుగులతో మద్దతుగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు (3/167) తీసి మంచి ప్రదర్శన ఇచ్చాడు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్:

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేసింది. జేమీ స్మిత్ అజేయంగా 184 పరుగులు చేయగా, హ్యారీ బ్రుక్ 158 పరుగులు చేశాడు. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ 6/70తో ఇంగ్లాండ్‌ను కట్టడి చేశాడు.

భారత రెండో ఇన్నింగ్స్:

భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 427/6 స్కోరు వ‌ద్ద డిక్లేర్ చేసింది. గిల్ మరోసారి మెరిసి 161 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్:

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జేమీ స్మిత్ 99 బంతుల్లో 88 పరుగులు చేశాడు. మిగ‌తా ప్లేయ‌ర్లు రాణించ‌లేదు.

45
ఆకాష్ దీప్ విజృంభణ

భారత యువ పేసర్ ఆకాష్ దీప్ 6 వికెట్ల‌తో ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను సమూలంగా దెబ్బతీశాడు. ఇది టెస్ట్ ఫార్మాట్‌లో అతని తొలి ఆరు వికెట్ల ఘనత. ఆకాశ్ దీప్ ప్రదర్శన భారత్ విజయానికి కీలకంగా నిలిచింది. ఇతర బౌలర్లు మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లు, ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీసుకున్నారు.

55
ఈ విజయంలో కెప్టెన్ గిల్ అద్భుతం చేశాడు

ఇంగ్లాండ్ గడ్డపై భారత్ విజయంలో కెప్టెన్ శుభ్ మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 269 పరుగులు డబుల్ సెంచరీ కొట్టాడు.

ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలింగ్ ను దంచికొడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో సెంచరీ సాధించాడు. గిల్ నాక్ తో ఇంగ్లాండ్ ముందు భారత్ ఏకంగా 608 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-1తో సమం చేసింది. తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, రెండవ టెస్ట్ భారత్ ఖాతాలో పడింది. మూడవ టెస్ట్ మ్యాచ్ జూలై 10 నుంచి లార్డ్స్‌లో ప్రారంభం కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories