Shubman Gill: టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారా టెండూల్కర్‌తో పాటు పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ ను కొనసాగించారని గాసిప్స్ ఉన్నాయి. గిల్ డేటింగ్ లిస్ట్‌లోని బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
శుభ్‌మన్ గిల్ క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు గాసిప్స్ వరల్డ్ లో కూడా హాట్ టాపిక్
భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ శభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపుతూ హాట్ టాపిక్ గా మారాడు. లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించే ఇన్నింగ్స్ లు ఆడాడు.
రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో మరో సెంచరీతో అదరగొట్టాడు. తన క్రికెట్ కెరీర్‌లో రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్న ఈ 25 ఏళ్ల యంగ్ క్రికెటర్ ఇప్పుడు సోషల్ మీడియా గాసిప్స్‌లోనూ హాట్ టాపిక్ గా మారాడు. ఇప్పుడు మరోసారి గిల్ లవ్ గాసిప్ప్ వైరల్ గా మారాయి. మరి గిల్ డేటింగ్ గాసిప్స్ లిస్టులో ఉన్న బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
27
సారా టెండూల్కర్‌తో మొదలైన గిల్ ప్రేమ కథ..
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో షుభ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నారని గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ వదంతులు ఊపందుకున్నాయి. అయితే ఇటీవలే గిల్ ఈ విషయంపై స్పందిస్తూ, “నేను సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నాను. దయచేసి ఇలాంటి వదంతులను ఆపండి” అని పేర్కొనడంతో సారాతో డేటింగ్ పుకార్లకు ఎండ్ కార్డ్ పడింది.
37
అవ్‌నీత్ కౌర్‌తో గిల్ డేటింగ్ గాసిప్స్
ప్రముఖ నటి అవ్‌నీత్ కౌర్ తో కూడా గిల్ లవ్ లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య సంబంధాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, వీరి సంబంధంపై గిల్ కానీ, అవ్‌నీత్ కౌర్ కానీ అధికారికంగా స్పందించలేదు.
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో కూడా గిల్ లవ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి భోజనం చేయడం చూసినట్టు పలువురు పేర్కొనడంతో ఈ చర్చ మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. గాసిప్స్ వచ్చినప్పటికీ గిల్ లేదా సారా ఇద్దరూ ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
57
పంజాబీ స్టార్ సోనమ్ బజ్వాతో కూడా గిల్ ప్రేమాయణం
పంజాబీ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోనమ్ బజ్వా - గిల్ మధ్య సంబంధాలు కూడా వైరల్ అయ్యాయి. వీరి సంబంధంపై చాలానే ఊహాగానాలు వచ్చాయి. ఒక పంజాబీ ఇంటర్వ్యూ షోలో వీరిద్దరూ జోక్‌లతో ప్రేమతో కూడిన సంభాషణలు చేయడంతో నెటిజన్లు వీరి మధ్య ప్రత్యేక బంధం ఉందని భావించారు. కానీ, ఈ ఊహలు కూడా అధికారిక సమాధానాల లేకుండా పుకార్లుగానే మిగిలాయి.
67
మరియా అరోయోగ్-గిల్: సోషల్ మీడియా మిస్టరీ
ఐపీఎల్‌లో గిల్‌కు మద్దతు తెలిపిన ఓ విదేశీ బ్యూటీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా అరోయోగ్ తో గిల్ డేటింగ్ అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. గిల్ ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయడం వల్ల వీరిద్దరి మధ్య సంబంధం ఉందని భావించారు. అయితే ఈ జోడీ ఎప్పుడూ బహిరంగంగా కనిపించలేదు. అధికారికంగా వీరి రిలేషన్ పై ఎలాంటి స్పందనలు చేయలేదు.
77
టీవీ నటి రిధిమా పండిట్ తో గిల్ డేటింగ్?
ఇటీవల టీవీ నటి రితిమా పండిట్ పేరు కూడా గిల్‌తో సంబంధం ఉన్నట్టు ప్రచారం అయ్యింది. వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి. కానీ రితిమా ఈ ఊహాగానాలను తిప్పి కొట్టింది. “నేను గిల్‌ను ఎప్పుడూ కలవలేదు. అతనితో ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు. పెళ్లి గురించి ఆలోచన కూడా లేదు” అని స్పష్టం చేశారు.
మొత్తంగా శుభ్‌మన్ గిల్ ఆటతీరు ఎంత అద్భుతంగా ఉంటుందో అతని వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. సారా టెండూల్కర్, సారా అలీ ఖాన్, అవ్నీత్ కౌర్, సోనమ్ బజ్వా వంటి బాలీవుడ్ ప్రముఖుల పేర్లతో గిల్ సంబంధం వార్తలు వైరల్ అయ్యాయి. అయితే గిల్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.