IND vs PAK : ఇండియా-పాకిస్తాన్ ఫైనల్.. దుబాయ్ పిచ్ షాకిస్తుందా? వారికి కష్టమే !

Published : Sep 28, 2025, 05:07 PM IST

India vs Pakistan Asia Cup Final 2025: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ ఆదివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను ఏ టీవీలో చూడాలి? దుబాయ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
ఆసియా కప్ 2025: ఇండియా-పాకిస్తాన్ ఫైనల్

ఆసియా కప్ 2025 తుదిదశకు చేరుకుంది. 41 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం ఫైనల్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

ఈ టోర్నీలో రెండు సార్లు పాకిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. లీగ్ దశలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తుచేసింది. సూపర్ ఫోర్ దశలో 6 వికెట్ల తేడాతో మరోసారి పాక్ ను ఓడించింది. ఇప్పుడు మూడోసారి ఫైనల్ లో ఆసియా కప్ 2025 టైటిల్ కోసం పాకిస్తాన్ తో తలపడేందుకు సిద్ధంగా ఉంది.

24
ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ ఎప్పుడు మొదలవుతుంది?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 28) భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. టాస్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు వేస్తారు.

మ్యాచ్‌ను ఏ టీవీలో ఫ్రీగా చూడాలి?

ఇండియా-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. అలాగే, సోనీ లివ్ యాప్‌లో కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఫైనల్ మ్యాచ్ ను డీడీ స్పోర్ట్స్ లో ఉచితంగా చూడవచ్చు.

34
భారత్ vs పాకిస్తాన్ : దుబాయ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది?

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా కొంచెం నెమ్మదిగా ఉంటుంది. దీంతో బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు చేయడానికి ఇబ్బంది పడ్డారు. కానీ, శుక్రవారం భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో పరిస్థితి మారింది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి 400 లకు పైగా పరుగుల చేశాయి.

ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఇలాంటి పిచ్‌నే ఆశించవచ్చు. దీంతో ఇరు జట్ల హిట్టర్లు ఈ పిచ్‌పై పరుగులు చేసే అవకాశం ఉంది. శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ, స్పిన్నర్లకు కొంత అనుకూలంగా ఉంది. అది ఈరోజు కూడా కొనసాగవచ్చని అంచనా. ఒకవేళ దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తే మరోసారి బ్యాటర్లకు ఇబ్బంది తప్పదు.

44
IND vs PAK : ఆసియా కప్ ఫైనల్ ఇరు జట్లు ప్లేయర్లు వీరే

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ మోకిమ్.

Read more Photos on
click me!

Recommended Stories