Asia Cup 2025 Final : భారత్ vs పాకిస్తాన్ గెలిచేది ఎవరు? హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే

Published : Sep 28, 2025, 12:28 PM IST

IND vs PAK : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ పై ఉత్సాహం, ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ ను గెలిచేది ఎవరు? ఇప్పటి వరకు రెండు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయి? ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్ - పాకిస్తాన్.. ఎవరు గెలుసుస్తారు?

ఆసియా కప్ 2025లో గ్రాండ్ ఫైనల్ కోసం అంతా సిద్ధమైంది. ఆదివారం (దుబాయ్‌లో) భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో ఓటమి చవిచూడని భారత్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. 

మరోవైపు, ఇప్పటికే రెండు సార్లు భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్ ఈసారి గెలిచి టైటిల్‌ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత్, పాకిస్తాన్ లు తొలిసారి ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. దీంతో మ్యాచ్ ఉత్కంఠను పెంచుతోంది.

DID YOU KNOW ?
ఆసియా కప్ లో భారత్
ఆసియా కప్ లో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటివరకు 8 సార్లు టైటిల్ సాధించింది. 9వ టైటిల్ కోసం పాకిస్తాన్ తో ఆదివారం తలపడనుంది.
25
భారత్ - పాకిస్తాన్ ఆసియా కప్ రికార్డులు ఎలా ఉన్నాయి?

ఆసియా కప్‌లో భారత్ పాకిస్తాన్ జట్లు ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు ఆడాయి. అందులో భారత్ 10 గెలిచింది. పాకిస్తాన్ 6 విజయాలు సాధించింది. రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.

• మొత్తం మ్యాచ్‌లు: 18

• భారత్ గెలుపు: 10

• పాకిస్తాన్ గెలుపు: 6

• ఫలితం లేకుండా ముగిసినవి: 2

వన్డే ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ రికార్డులు

• మ్యాచ్‌లు: 15

• భారత్ గెలిచింది: 8

• పాకిస్తాన్ గెలిచింది: 5

• ఫలితం లేకుండా ముగిసినవి: 2

టీ20 ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ రికార్డులు

• మ్యాచ్‌లు: 3

• భారత్ గెలిచింది: 2

• పాకిస్తాన్ గెలిచింది: 1

35
ఆసియా కప్ భారత్ vs పాకిస్తాన్ : ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు ఎవరు?

భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య భారత్ - పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌లలో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచారు. ఆయన 15 వికెట్లు తీశారు.

• హార్దిక్ పాండ్య (భారత్): 15 వికెట్లు (బెస్ట్: 3/8)

• భువనేశ్వర్ కుమార్ (భారత్): 11 వికెట్లు (బెస్ట్: 4/26)

• ఉమర్ గుల్ (పాకిస్తాన్): 11 వికెట్లు (బెస్ట్: 4/37)

• హారిస్ రౌఫ్ (పాకిస్తాన్): 9 వికెట్లు

• జస్ప్రీత్ బుమ్రా (భారత్): 7 వికెట్లు

45
ఆసియా కప్ భారత్ vs పాకిస్తాన్ : ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లు ఎవరు?

టీ20 మ్యాచ్‌లలో భారత్ - పాకిస్తాన్ పోటీల్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులతో టాప్ లో ఉన్నాడు. 11 ఇన్నింగ్స్‌లలో 492 పరుగులు చేశారు.

• విరాట్ కోహ్లీ (భారత్): 492 పరుగులు (11 ఇన్నింగ్స్)

• మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్): 228 పరుగులు (5 ఇన్నింగ్స్)

• షోయబ్ మాలిక్ (పాకిస్తాన్): 164 పరుగులు (9 ఇన్నింగ్స్)

• మొహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్): 156 పరుగులు (8 ఇన్నింగ్స్)

• యువరాజ్ సింగ్ (భారత్): 155 పరుగులు (8 ఇన్నింగ్స్)

55
ఆసియా కప్ 2025 ఫైనల్ : భారత్ vs పాకిస్తాన్ జట్లు

భారత్ జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.

పాకిస్తాన్ జట్టు: సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్, హుస్సేన్ తలాత్, హసన్ అలీ, ఖుశ్దిల్ షా, హారిస్ రౌఫ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, సల్మాన్ మిర్జా.

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే ఫైనల్ క్రికెట్ అభిమానులకు పండగే.రికార్డులు చూస్తే భారత్ ఆధిపత్యం చూపించినా, ఫైనల్‌లో పాకిస్తాన్ పోరాడే అవకాశముంది. ఫలితం ఏదైనా, ఆదివారం మ్యాచ్ ఆసక్తికరంగా ఉండడం ఖాయం.

Read more Photos on
click me!

Recommended Stories