ఆసియా కప్ 2025 : భారత్–పాకిస్తాన్ మ్యచ్ కు వర్షం అడ్డుపడనుందా?

Published : Sep 13, 2025, 07:17 PM IST

India vs Pakistan: ఆసియా కప్ 2025 లో భారత్, పాకిస్తాన్ జట్లు ఆదివారం (సెప్టెంబర్ 14న) తలపడనున్నాయి. అయితే, మ్యాచ్ జరిగే దుబాయ్‌లోవాతావరణం ఎలా ఉండనుంది? భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడనుందా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
దుబాయ్ వేదికగా భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ : వాతావరణం ఎలా ఉంటుంది?

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్లు విజయంతో టోర్నీని ప్రారంభించాయి. ఈ టోర్నీలో బిగ్ మ్యాచ్ గా ఆసక్తి రేపుతున్నభారత్ vs పాకిస్తాన్ మధ్య పోరు ఆదివారం జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాదుల పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ వాతావరణ పరిస్థితులు ఆటగాళ్లకు, ప్రేక్షకులకు పెద్ద సవాలుగా నిలవనున్నాయి.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. అధిక ఆర్ద్రత కారణంగా వేడి పరిస్థితులు 44–45 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. రాత్రి మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఉష్ణోగ్రతలు సుమారు 30 డిగ్రీలుగా ఉండనున్నాయి.

25
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ : వర్షం పడే అవకాశముందా?

దుబాయ్‌లో సెప్టెంబర్ 14న ఆకాశం క్లియర్ గా ఉండనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం పడే అవకాశం లేనందున, మ్యాచ్ అంతరాయం లేకుండా సాగుతుంది. అయితే వేడి, గాలిలో ఆర్ద్రత ఆటగాళ్ల శారీరక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అలాగే, గాలి నాణ్యత కూడా కాస్త ఇబ్బంది పేట్టే విధంగా ఉండనుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితులు అభిమానులకు కూడా అసౌకర్యం కలిగించే అవకాశముంది.

35
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ పై గాలి ప్రభావం

ఉత్తర–తూర్పు దిశనుండి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కొంతసేపు గాలి వేగం గంటకు 33 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. అయితే ఈ గాలులు తీవ్ర వేడి నుంచి పెద్దగా ఉపశమనం ఇవ్వలేవని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ గాలులు మ్యాచ్ పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం కూడా లేదు.

45
భారత్ vs పాకిస్తాన్: దుబాయ్ పిచ్ ఎలా ఉంటుంది?

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని కొత్త పిచ్‌పై భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం సాధారణంగా బ్యాటింగ్, బౌలింగ్ కు సమానంగా అనుకూలించనుంది. ప్రారంభ ఓవర్లలో పేస్ బౌలర్లకు బౌన్స్, స్వింగ్ లభించే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ కొనసాగేకొద్దీ పిచ్ నెమ్మదిగా మారి స్పిన్ బౌలర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ సమయంలో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది.

ఈ వేదికలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా విజయాలు సాధించాయి. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన 112 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 59 సార్లు ఛేజింగ్ జట్లు విజయం సాధించగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 52 విజయాలు సాధించాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 139–145 రన్స్ మధ్య ఉంది.

55
భారత్ vs పాకిస్తాన్.. గెలుపు జోష్ లో రెండు జట్ల ప్లేయర్లు

భారత్, పాకిస్తాన్ జట్లు రెండూ టోర్నమెంట్‌లో తమ తొలి మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించాయి. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించగా, పాకిస్తాన్ ఒమన్‌పై 93 రన్స్ తేడాతో గెలిచింది.

ఆసియా కప్‌లో ఇది ఆరవ మ్యాచ్ కాగా, భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరు సెప్టెంబర్ 14న రాత్రి 8:00 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో వాతావరణం, పిచ్ పరిస్థితులు రెండూ ఆట ఫలితంపై కీలక ప్రభావం చూపనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories