India vs England : ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో రెండో టెస్టుకు సిద్ధమైంది. అయితే, తొలి టెస్టు ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జట్టు నుంచి తప్పుకున్నాడు.
తొలి టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ జట్టు నుంచి తప్పుకోవడం టీమిండియాను బాగా ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే, విరాట్ కోహ్లీని తొలి రెండు టెస్టుల నుంచి ఎందుకు తప్పించారనే ప్రశ్నపై అనేక ప్రశ్నలు వచ్చాయి. తొలి టెస్టు ఓటమి తర్వాత కోహ్లీ విషయం మరింత హాట్ టాపిక్ అయింది.
Virat Kohli
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ తో జరిగే తొలి రెండు టెస్టులకు అకస్మాత్తుగా జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. విరాట్ కోహ్లి గైర్హాజరీతో హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా షాకింగ్ ఓటమిని చవిచూసి.. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-1 తో వెనుకంజలో ఉంది.
Virat Kohli
ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన టెస్ట్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న విరాట్ కోహ్లి హఠాత్తుగా మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల నుండి ఎందుకు వైదొలిగాడు అనే ప్రశ్నకు వెంటనే సమాధానం రాలేదు.
అయితే, తాజాగా విరాట్ కోహ్లీ తల్లి సరోజా కోహ్లి గురించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం సరోజా కోహ్లి ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి, విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకుంటూ.. తన తల్లి ఆరోగ్యంపై వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లి సోదరుడు వికాస్ కోహ్లీ సోషల్ మీడియా పోస్ట్‌లో, మా అమ్మ ఆరోగ్యం గురించి పోస్ట్‌లు వ్యాపించడాన్ని తాను గమనించాననీ, అందులో వాస్తవం లేదని పేర్కొన్నాడు.
కోహ్లీ అమ్మ ఆరోగ్యం గురించి వైరల్ అయిన పోస్టుపై స్పందించిన వికాస్.. మా వాళ్లు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ను మీడియాను అభ్యర్థిస్తున్నాను, దయచేసి స్పష్టమైన సమాచారం లేకుండా తప్పుడు ప్రచారం చేయకండి అని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ రెండు టెస్టుకు దూరం కావడానికి వికాస్ కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లి బహిరంగంగా కూడా ఎక్కడా కనిపించలేదు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.