ఈ ప్ర‌పంచంలో నా ప్ర‌యాణం ముగిసింది అనుకున్నా.. త‌న యాక్సిడెంట్ పై రిష‌బ్ పంత్

First Published | Jan 30, 2024, 9:45 AM IST

Rishabh Pant: డిసెంబర్ 2022లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్ప‌టి నుంచి క్రికెట్ కు దూర‌మైన రిష‌బ్ పంత్ ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కోలుకుంటున్నారు. "ఆ రోజు నా జీవిత ప్ర‌యాణం ఇక ముగిసిపోయింద‌ని అనుకున్నాన‌ని" తొలిసారి యాక్సిడెంట్ పై పంత్ స్పందించాడు. 
 

Rishabh pant car accident: టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మ‌న్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ లో జరిగిన ఘోర‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తృటిలో మృత్యువు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ప్రస్తుతం పంత్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కోలుకుంటున్నాను. ప్ర‌స్తుతం ఫిట్ నెస్ సాధించ‌డంపై దృష్టిపెట్టిన అత‌ను కొద్ది రోజుల్లోనే గ్రౌండ్ లోకి దిగ‌నున్నాడు. తాజాగా త‌న కారు ప్ర‌మాదంపై స్పందించిన రిష‌బ్ పంత్.. యాక్సిడెంట్ సమయంలో 'ఈ లోకంలో తన ప్ర‌యాణం ముగిసిపోయింద‌ని' అనిపించిందని పేర్కొన్నాడు.

రెండేళ్ల క్రితం డిసెంబర్ లో రూర్కీలోని తన ఇంటికి వెళ్తుండగా రిష‌బ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. 2022 డిసెంబర్ 30 ఉదయం తన మెర్సిడెస్ కారు డివైడర్ ను ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. యాక్సిడెంట్ జ‌రిగిన త‌ర్వాత మంటలు చెల‌రేగాయ‌నీ, ఆ స‌మ‌యంలో తాను చనిపోతానని భావించానని రిషబ్ పంత్ త‌న కారు ప్ర‌మాదం క్ష‌ణాల‌ను గుర్తుచేశారు.

Latest Videos


ఈ ఘోర కారు ప్ర‌మాదం త‌ర్వాత రిష‌బ్ పంత్ బెడ్ కు ప‌రిమిత‌మ‌య్యాడు. ప్ర‌మాదంతో కుడి మోకాలికి, నుదుటిపై గాయాలయ్యాయి. ఈ ప్ర‌మాద స‌మ‌యం నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్న పంత్ ప్ర‌స్తుతం కోలుకున్నాడు. ఈ క్ర‌మంలోనే స్టార్ స్పోర్ట్స్ తో రిష‌బ్ పంత్ మాట్లాడుతూ 'నా జీవితంలో తొలిసారిగా ఈ ప్రపంచంలో నా ప్ర‌యాణం ముగిసిందని భావించాను. ప్రమాదం సమయంలో గాయాల గురించి నాకు తెలుసు.. ప్ర‌మాదంతో కారులో మంట‌లు వ‌చ్చాయి. ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చు.. అయితే, నేను అదృష్టవంతుడిని. ఎవరో నన్ను కాపాడారని' తెలిపాడు.

Rishabh Pant

ప్ర‌మాదం త‌ర్వాత అక్క‌డున్న వెంట‌నే స‌మాచారం అందించ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. "నేను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందని నేను వైద్యుడిని అడిగాను. దీనికి 16 నుంచి 18 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే, ఈ స‌మ‌యాన్ని త‌క్కువ‌కు చేయ‌డానికి నేను మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ని నాకు తెలుసు.. అందుకే వైద్యుల సాయంతో అదే విధంగా ముందుకు ప్ర‌యాణం సాగించాను ' అని పంత్ తెలిపాడు. 

Rishabh Pant

ప్ర‌మాదం త‌ర్వాత క్రికెట్ దూరంగా ఉన్న రిష‌బ్ పంత్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు సార‌థిగా ఉన్న పంత్ మళ్లీ ఐపీఎల్ లో ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. గ‌తేడాది దుబాయ్ లో కోక‌కోలా ఏరీనాలో జ‌రిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో ఫ్రాంచైజీ ప్రతినిధి బృందంలో క‌లిసి రిష‌బ్ పంత్ పాలుపంచుకున్నాడు.

click me!