India vs England-Rohit Sharma: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరిన్ని రికార్డులు సృష్టించనున్నాడు.
MS Dhoni, Rohit Sharma
ఇప్పటికే రోహిత్ శర్మ ఒక వన్డేలో 264 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు. మూడుసార్లు 200కు పైగా పరుగులు చేశాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడి 3737 పరుగులు చేశాడు. అలాగే, 262 వన్డేలు ఆడి 10,709 పరుగులు చేశాడు.
Dhoni Rohit, Sharma
ఇక 151 టీ20లు ఆడిన రోహిత్ శర్మ 3974 పరుగులు చేశాడు. 14 నెలల విరామం తర్వాత అఫ్గానిస్థాన్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, తొలి టీ20లో రనౌట్ కాగా, రెండో టీ20లో గోల్డెన్ డక్ తో నిరాశపరిచాడు. అయితే, మూడో టీ20లో సూపర్ సెంచరీతో అదరగొట్టాడు.
Dhoni-Rohit
అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్ గా రోహిత్ శర్మ 116 ఇన్నింగ్స్ లలో 209 సిక్సర్లు కొట్టాడు. ఇంకా మరో మూడు 3 సిక్సర్లు కొడితే 212 సిక్సర్లు బాదిన తొలి భారత కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్ మన్ ఇయాన్ మోర్గాన్ 233 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ 212 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ 171 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ 170 సిక్సర్లతో ఐదో స్థానంలో, విరాట్ కోహ్లీ 138 సిక్సర్లతో ఆరో స్థానంలో, ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ 136 సిక్సర్లతో ఏడో స్థానంలో, ఏబీ డివిలియర్స్ 135 సిక్సర్లతో 8వ స్థానంలో ఉన్నారు.