Sunil Gavaskar, Virat Ball, Virat Kohli, Rohit Sharma,
India vs England-Bazball-Virat Ball: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియాను దెబ్బకొట్టేందుకు ఇంగ్లాండ్ బాజ్ బాల్ వ్యూహం సిద్ధం చేస్తోంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఇంగ్లిష్ టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంగ్లండ్ బాజ్ బాల్ వ్యూహంతో విజయవంతమైన ప్రయాణం సాగిస్తోంది. భారత్-ఇగ్లాండ్ టెస్టు సిరీస్ కు ముందు కూడా బాజ్ బాల్ వ్యూహం హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్రమంలో "ఇంగ్లాండ్ బాజ్‌బాల్‌ను ఎదుర్కోవడానికి మాకు విరాట్‌బాల్ ఉందని" టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.
India , Cricket, virat kohli
టెస్టు క్రికెట్ లో ఆతిథ్య జట్టు భారత్ కు కట్టడి చేయడానికి తమ వద్ద బాజ్ బాల్ వ్యూహం ఉందని ఇంగ్లాండ్ పేర్కొంటుండగా.. బాజ్ బాల్ ను ఎదుర్కొనేందుకు భారత్ వద్ద 'విరాట్ బాల్ ' ఉందని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. "విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కోహ్లీతోటెస్టుల్లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. అతనికి మంచి కన్వర్షన్ రేట్ ఉంది. అతను బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే మంచి ఫామ్ లో ఉన్నాడు. అంటే ఇంగ్లాండ్ బాజ్ బాల్ ను ఎదుర్కోవడానికి మాకు విరాట్ బాల్ సిద్ధంగా ఉంది" అని సునీల్ గవాస్కర్ అన్నారు.
Virat Kohli, RohitSharma
టెస్టు క్రికెట్ లో కోహ్లీ 29 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు సాధించాడనీ, రాబోయే ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో కోహ్లీ నిలకడ, కన్వర్షన్ రేట్ నిర్ణయాత్మక అంశమని సునీల్ గవాస్కర్ అన్నారు. కాగా, భారత్ తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా జరగనుంది. తదుపరి నాలుగు టెస్టులకు విశాఖపట్నం, రాజ్ కోట్, రాంచీ, ధర్మశాలలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి టెస్టు సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో జాబితాలో భారత్ నెంబర్.2, ఇంగ్లాండ్ 7వ స్థానంలో ఉన్నాయి. ఈ తొలి ప్లేస్ లోకి రావడాని భారత్ కు ఈ సిరీస్ కీలకం.
Virat Kohli
ఇంగ్లాండ్ బాజ్ బాల్ గురించి సునీల్ గవాస్కర్ మరింతగా మాట్లాడుతూ.. స్వదేశీ అడ్వాంటేజ్ తో భారత స్పిన్నర్లకు ఈ విధానం గట్టి సవాలును ఎదుర్కొంటుందని అన్నారు. "బ్యాట్స్ మన్ దాడి చేయాలని చూసే దూకుడు విధానం ఇది. పరిస్థితి ఎలా ఉన్నా అటాకింగ్ క్రికెట్ ఆడాలని కోరుకుంటారు. ఈ విధానం భారత స్పిన్నర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందో లేదో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది"' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
Virat Kohli
కాగా, 'బాజ్ బాల్' అనే పదాన్ని ఇఎస్పిఎన్ క్రిక్ఇన్ఫో వెబ్ సైట్ యూకే ఎడిటర్ ఆండ్రూ మిల్లర్ 2022 మేలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కోచ్ గా మెక్కల్లమ్ నియమించిన తరువాత సృష్టించాడు. ఈ పదాన్ని 2023 లో సంవత్సరంలోని 10 అత్యంత ముఖ్యమైన కొత్త పదాలలో ఒకటిగా హార్పర్ కాలిన్స్ గుర్తించారు. కొలిన్స్ డిక్షనరీలో ఈ పదానికి నిర్వచనం ఇలా ఉంది: "టెస్ట్ క్రికెట్ లో ఒక శైలి, దీనిలో బ్యాటింగ్ జట్టు అత్యంత దూకుడుగా ఆడుతుంది".