India , Cricket, virat kohli
India vs England-Virat Kohli: ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులు సృష్టించనున్నాడు. అలాగే, పాత రికార్డులను బద్దలు కొట్టనున్నాడు. ఇక ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీకి మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టబోయే టాప్-5 రికార్డులు గమనిస్తే..
Virat Kohli
1. టెస్టు క్రికెట్ లో 9వేల పరుగులు:
టెస్టు క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీకి ఇంకా 152 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సిరీస్ లో మరో 152 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ ల సరసన నిలుస్తాడు. ఈ ముగ్గురు ప్లేయర్లు భారత్ తరఫున 9000 పరుగులు పూర్తి చేశాడు.
Virat Kohli, RohitSharma
2. టెస్టు క్రికెట్ లో వేయి బౌండరీలు:
పరుగులతో పాటు బౌండరీల విషయంలో కూడా విరాట్ కోహ్లీ మరో రికార్డును నమోదు చేయనున్నాడు. టెస్టు క్రికెట్‌లో 1000 బౌండరీలు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీ ఇంకా 9 బౌండరీల దూరంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్ టెస్టు క్రికెట్‌లో 1000 బౌండరీలు బాదిన ఘనత సాధించారు.
Virat Kohli
3.ఇంగ్లాండ్ పై 2000 పరుగులు చేయనున్న విరాట్ కోహ్లీ:
ఇంగ్లాండ్ పై 2000 టెస్టు పరుగులు పూర్తి చేయనున్నాడు. ఈ సిరీస్ లో మరో 9 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ ఇంగ్లాండు పై 2000 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ ఘనత సాధించడంతో పాటు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ ల సరసన నిలుస్తాడు.
Virat Kohli
4. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా.. :
ఇంగ్లాండ్ పై తన కెరీర్ లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించనున్నాడు. మరో 52 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ పై జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాపై 25 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 2042 పరుగులు చేశాడు.
Virat Kohli,Sachin Tendulkar
5. ఇంగ్లాండు పై అత్యధిక సెంచరీలు:
ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించనున్నాడు. దీనికి మరో మూడు సెంచరీలు అవసరం. సచిన్ టెండూల్కర్, గవాస్కర్ చెరో 7 సెంచరీలు చేయగా, కోహ్లీ ఖాతాలో 5 సెంచరీలు ఉన్నాయి.