
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) దులీప్ ట్రోఫీ 2025కి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ప్రముఖ రెడ్ బాల్ టోర్నమెంట్‌లలో ఒకటైన ఈ టోర్నమెంట్ ఈసారి కూడా జోన్ వారీగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జోన్లు ఉన్నాయి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్‌లు దులీప్ ట్రోఫీలో పోటీపడనున్నాయి.
ఈ టోర్నమెంట్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు జరుగుతుంది. మొత్తం ఐదు నాకౌట్ మ్యాచ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
దులీప్ ట్రోఫీలో ప్రారంభ మ్యాచ్‌లు ఆగస్టు 28న రెండు క్వార్టర్ ఫైనల్స్‌తో మొదలవుతాయి.
• క్వార్టర్ ఫైనల్ 1: నార్త్ జోన్ vs ఈస్ట్ జోన్
• క్వార్టర్ ఫైనల్ 2: సెంట్రల్ జోన్ vs నార్త్ ఈస్ట్ జోన్
ఈ మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. ఓడిన జట్లు నేరుగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తాయి. గెలిచిన జట్లు సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జరిగే సెమీఫైనల్స్‌కి అర్హత సాధిస్తాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు జరుగుతుంది.
ఈసారి దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ మళ్లీ సంప్రదాయ జోనల్ ఫార్మాట్‌లోనే జరుగుతుంది. గతంలో వాడిన గ్రూప్ స్టైల్ పద్ధతిని తొలగించారు. ప్రతి మ్యాచ్‌తో పాటు ఫైనల్ వరకు అన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) I సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఉంటుంది.
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కర్ణాటకలోని బెంగళూరు, దేవనహళ్లి సమీపంలో ఉంది. గతంలోని నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో అభివృద్ధి చేశారు. ఈ కేంద్రం 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భారత క్రికెట్‌కు ప్రపంచ స్థాయి శిక్షణ వేదికగా నిలుస్తోంది.
ఇక్కడ మూడు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మైదానాలు, 86 ప్రాక్టీస్ పిచ్ లు, ఫిట్‌నెస్, స్పోర్ట్స్ సైన్స్ సదుపాయాలు ఉన్నాయి. క్రికెటర్లకు నూతన సాంకేతికతలతో శిక్షణ, రిహాబిలిటేషన్, విశ్లేషణా సేవలు అందిస్తున్నాయి.
దులీప్ ట్రోఫీని క్రికెట్ అభిమానులు అన్ని మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
• టీవీ లైవ్ ప్రసారం: స్పోర్ట్స్18 ఛానల్
• లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్స్ ద్వారా ఉచితంగా చూడొచ్చు.
• క్వార్టర్ ఫైనల్ 1: నార్త్ జోన్ vs ఈస్ట్ జోన్
తేదీలు: 28 ఆగస్టు - 31 ఆగస్టు 2025, ఉదయం 9:30 IST
వేదిక: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
• క్వార్టర్ ఫైనల్ 2: సెంట్రల్ జోన్ vs నార్త్ ఈస్ట్ జోన్
తేదీలు: 28 ఆగస్టు - 31 ఆగస్టు 2025, ఉదయం 9:30 IST
వేదిక: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
• దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ 1: సౌత్ జోన్ vs TBD
తేదీలు: 4 సెప్టెంబర్ - 7 సెప్టెంబర్ 2025
వేదిక: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
• దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ 2: వెస్ట్ జోన్ vs TBD
తేదీలు: 4 సెప్టెంబర్ - 7 సెప్టెంబర్ 2025
వేదిక: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
• దులీప్ ట్రోఫీ ఫైనల్: TBD vs TBD
తేదీలు: 11 సెప్టెంబర్ - 14 సెప్టెంబర్ 2025
వేదిక: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
నార్త్ జోన్: చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, సర్వీసెస్
సౌత్ జోన్: ఆంధ్రప్రదేశ్, గోవా, హైదరాబాద్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు
సెంట్రల్ జోన్: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రైల్వేస్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, విదర్భ
ఈస్ట్ జోన్: అస్సాం, బిహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర
నార్త్ ఈస్ట్ జోన్: అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం
వెస్ట్ జోన్: బరోడా, గుజరాత్, మహారాష్ట్ర, ముంబై, సౌరాష్ట్ర