India vs Pakistan: పాకిస్తాన్ తో ఆడే ప్ర‌స‌క్తే లేదన్న భారత్

Published : Jul 31, 2025, 07:42 PM IST

India vs Pakistan: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా, పాక్‌తో సెమీఫైనల్‌లో ఆడేందుకు యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ నో చెప్పింది. దీంతో డ‌బ్ల్యూసీఎల్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ర‌ద్దు అయింది.

PREV
15
పాక్‌తో సెమీఫైనల్ కు నో చెప్పిన భార‌త్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 సెమీఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అధికారికంగా రద్దు అయింది. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు, పాక్‌తో ఆడడానికి నిరాకరించడంతో మ్యాచ్ రద్దయింది. ఈ నిర్ణయం పాహల్గాం ఉగ్రదాడికి నిరసనగా తీసుకుంది.

DID YOU KNOW ?
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఛాంపియన్ గా భారత్
భారత్ ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) తొలి టైటిల్‌ను గెలుచుకుంది. జూలై 13, 2024న ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది.
25
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ మ్యాచ్ లో కూడా నో చెప్పిన భార‌త్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో జూలై 20న లీగ్ మ్యాచ్‌లోనూ భారత్ పాకిస్థాన్‌తో ఆడలేదు. ఇప్పుడు అదే నిర్ణయాన్ని సెమీఫైనల్‌ లో కూడా తీసుకుంది. మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో గురువారం జరగాల్సి ఉండగా, ఇండియన్ లెజెండ్స్ అందరూ పాకిస్థాన్ తో మ్యాచ్ ను బహిష్కరించాలని నిర్ణ‌యం తీసుకున్నారు.

35
భార‌త్ మాతాకీ జై

టీంలో యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్ వంటి ప్రముఖులున్నారు. వీరందరూ ఒకే గొంతుతో "దేశమే ముందే" అనే నినాదాన్ని వినిపించారు. "భారత జెండాను ధరించడం మాకు గర్వకారణం. మేము ఎప్పటికీ దేశాన్ని కిందపడనివ్వం. భారత్ మాతా కీ జై" అని జట్టు సభ్యులు వెల్లడించారు.

45
పాక్ తో ఆడేది లేద‌ని తేల్చి చెప్పిన శిఖ‌ర్ ధావ‌న్

ఇండియా గ‌బ్బ‌ర్ శిఖర్ ధావన్ పాక్ తో ఆడేది లేద‌ని తేల్చి చెప్పారు. పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన తొలి వ్యక్తిని తానే అని ప్రకటించారు. ఏప్రిల్‌లో జరిగిన పాహల్గాం ఉగ్రదాడిని ప్ర‌స్తావించిన శిఖ‌ర్ ధావ‌న్.. “మే 11న తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. మా ముందు మొద‌ట‌గా క‌నిపించేది ఇండియానే.. దేశమే నాకు అన్నీ” అని తెలిపారు.

55
సెమీ ఫైన‌ల్ ఆడ‌కుండా టోర్నీకి వీడ్కోలు ప‌లికిన ఇండియా లెజెండ్స్

ఇండియా సెమీఫైనల్‌కు చేరిన విధానం ప్రత్యేకం. వెస్టిండీస్ తో చివరి లీగ్ మ్యాచ్‌ను కేవలం 13.2 ఓవర్లలో ముగించి, టాప్ 4లో నిలిచారు. అయితే సెమీఫైనల్‌కు తుది అర్హత పొందిన తర్వాత కూడా పాక్‌తో ఆడేందుకు నిరాక‌రించడంతో మ్యాచ్ రద్దు అయింది.

ఈ నిర్ణయం పట్ల డ‌బ్ల్యూసీఎల్ (WCL) నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. “ప్రజల భావోద్వేగాలనున మించిన‌వి లేవు. భారత్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం” అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహించాల్సిన EaseMyTrip సంస్థ కూడా వెనకడుగు వేసింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు నిశాంత్ మాట్లాడుతూ.. “ఉగ్రవాదం ఉన్న చోట క్రికెట్ ఉండకూడదు” అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “దేశ ప్రజల భావాలను గౌరవిస్తూ, భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు మేము మద్దతివ్వం” అని EaseMyTrip స్పష్టం చేసింది.

ఆగస్టు, అక్టోబర్ లో భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ లు

ఇండియా-పాకిస్థాన్ జాతీయ జట్లు సెప్టెంబర్ 14న యుఏఈలో జరిగే ఆసియా కప్‌లో తలపడతాయి. మహిళల జట్లు అక్టోబర్ 6న కొలంబోలో జరిగే ఐసీసీ వ‌న్డే వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories