Gautam Gambhir: ఓవల్ మైదానంలో పిచ్ క్యురేటర్‌, గంభీర్ మధ్య ఫైట్.. వీడియో వైరల్

Published : Jul 29, 2025, 10:02 PM IST

Gautam Gambhir: ఓవల్ మైదానంలో భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్, పిచ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

PREV
15
అప్పుడే హీటెక్కిన‌ ఓవల్ టెస్ట్ పిచ్

లండన్‌లో జులై 31 నుంచి ప్రారంభం కానున్న భారత్-ఇంగ్లాండ్ ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఓవల్ మైదానంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ది ఓవల్ స్టేడియం పిచ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జ‌రిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

25
మీరు కేవలం గ్రౌండ్స్‌మన్ మాత్రమే: గంభీర్

వీడియో ప్రకారం, గంభీర్ పిచ్ క్యురేటర్‌ను ‘‘మీరు ఇక్కడ కేవలం గ్రౌండ్స్‌మన్ మాత్రమే అని గుర్తుంచుకోండి’’ అంటూ కామెంట్స్ చేసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే ఈ మాటల స్థాయికి ముందు వారు ఏ విషయంపై చర్చించుకున్నారో స్పష్టత లేదు. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం రన్‌అప్ ఏరియాలో జరిగింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే ఈ ఘర్షణ వెలుగు చూసింది.

35
సితాన్షు కోటక్ జోక్యంతో ముగిసిన వాగ్వాదం

వివాదం తీవ్రమవుతున్న దశలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ జోక్యం చేసుకుని పరిస్థితిని చల్లబరిచారు. కానీ గంభీర్ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై భిన్న కామెంట్స్ తో పలువురు స్పందిస్తున్నారు.

45
భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సమం అవుతుందా?

ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్లతో గెలిచింది. రెండో టెస్ట్‌లో భారత్ 336 పరుగుల భారీ విజయంతో తిరిగి బదులిచ్చింది. 

మూడో టెస్ట్ లార్డ్స్‌లో జరిగింది. ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది. నాల్గవ టెస్ట్ మాంచెెస్టర్‌లో డ్రాగా ముగిసింది. చివ‌రి మ్యాచ్ లో భార‌త్ గెలిస్తే సిరీస్ స‌మం అవుతుంది.

55
చివరి టెస్ట్ లో గెలుపే ల‌క్ష్యంగా భార‌త్ వ్యూహాలు

ఓవల్ టెస్ట్‌తో సిరీస్ ముగియనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిస్తే లేదా డ్రా చేస్తే సిరీస్ వారి ఖాతాలోకే చేరుతుంది. కానీ టీమిండియా విజయాన్ని సాధిస్తే సిరీస్‌ను 2-2తో సమం అవుతుంది. మాంచెస్టర్ టెస్ట్‌లో చివరి రెండు రోజుల అద్భుత ప్రదర్శన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు ఓవల్ టెస్ట్‌కు మంచి ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories