Asia Cup 2025 Final India : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ తో భారత జట్టు తలపడనుంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధంగా ఉంది. పాక్ తో తలపడే భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు తెలసుకుందాం.
ఆసియా కప్ 2025 ఫైనల్ కు పోరుకు సర్వం సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఆదివారం (సెప్టెంబర్ 28, 2025న) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ తో టైటిల్ పోరులో తలపడనుంది. ఇది ఆసియా కప్‌లో భారత్-పాక్ మధ్య తొలి ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం.
ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎలా వుంటుంది అనే చర్చ సాగుతోంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టులో ఉంటాడా? లేదా? అనేది ఆసక్తిని పెంచుతోంది. అలాగే, అర్షదీప్ సింగ్ శుక్రవారం శ్రీలంకతో సూపర్ ఓవర్‌లో చూపిన అద్భుత ప్రదర్శన నేపథ్యంలో ప్లేయింగ్ 11 ఎంపిక ఆసక్తిని పెంచుతోంది.
25
IND vs PAK : భారత జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ & శుభ్‌మన్ గిల్
యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతను పాక్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఓపెనింగ్ చేయనున్నాడు. మరోసారి పాక్ బౌలర్లపై తన ధైర్యవంతమైన ఆరంభాన్ని కొనసాగించడానికి చూస్తున్నాడు. అతనితో కలిసి శుభ్‌మన్ గిల్ కూడా ఓపెనింగ్‌కి సిద్ధంగా ఉన్నాడు. గిల్‌కు ఈ టోర్నమెంట్‌లో మిక్స్ ఫార్మ్ ఉన్నా, ఫైనల్‌లో తనదైన ముద్రవేయాలని చూస్తున్నాడు.
35
IND vs PAK : భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివం దుబే
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ స్ట్రోక్ ప్లేతో జట్టు నేతృత్వం వహిస్తాడు. ఫైనల్‌లో సూర్యకుమార్, బ్యాట్స్‌మన్‌గా, అలాగే కెప్టెన్‌గా ఆసియా కప్‌ను విజయవంతంగా ముగించాలనుకుంటున్నాడు. యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు. మరోసారి అద్భుతమైన నాక్ ఆడాలని టార్గెట్ పెట్టుకున్నాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్ నంబర్ 5 లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడనున్నాడు. శివం దుబే హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి రానున్నాడు.
IND vs PAK : భారత ఆల్‌రౌండర్స్, స్పిన్నర్లు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్
హార్దిక్ పాండ్యా గాయంతో తాత్కాలికంగా అనిశ్చితి నెలకొంది. అతను జట్టులోకి వస్తాడా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, కీలకమైన ఫైనల్ మ్యాచ్ కావడంతో పాండ్యా సేవలు కీలకం కానున్నాయి. పెద్దగాయం లేదు కాబట్టి భారత ఆటలో కీలక పాత్ర పోషించగలడు. అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టుకు మరింత బలం అందిస్తాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు.
55
IND vs PAK : బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా & అర్షదీప్ సింగ్
జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకపై సూపర్ 4 మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. ఫైనల్‌లో బౌలింగ్ అటాక్‌లో అతనికి ప్రధాన బాధ్యత ఉంటుంది. అర్షదీప్ సింగ్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. అయితే, ఫైనల్ జట్టులో చోటు దక్కించుకోవడం అంత ఈజీకాదు.
పాక్ తో జరిగే ఫైనల్ పోరుకు భారత ప్లేయింగ్ XI:
1. అభిషేక్ శర్మ
2. శుభ్‌మన్ గిల్
3. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
4. తిలక్ వర్మ
5. సంజూ శాంసన్ (వికెట్ కీపర్)
6. శివం దుబే
7. హార్దిక్ పాండ్యా
8. అక్షర్ పటేల్
9. జస్ప్రీత్ బుమ్రా
10. వరుణ్ చక్రవర్తి
11. కుల్‌దీప్ యాదవ్
ఈ 11 మంది ఆటగాళ్లతో భారత్ ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి మరోసారి ఛాంపియన్ గా నిలవాలని టార్గెట్ పెట్టుకుంది.