Abhishek Sharma: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

Published : Sep 27, 2025, 02:02 AM IST

Abhishek Sharma: ఆసియా కప్ 2025లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 309 పరుగులతో కొత్త రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ, రిజ్వాన్ రికార్డులను బద్దలు కొట్టాడు. 

PREV
16
శ్రీలంక మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్ 26) జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్‌లో టీ20 ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఒక్క ఆసియా కప్ టీ20 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 31 బంతుల్లో 61 పరుగుల నాక్ ఆడాడు. ఇందులో ఎనిమిది బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు 309 పరుగులు పూర్తి చేసి, పాకిస్థాన్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ (281 పరుగులు, 2022) రికార్డును అధిగమించాడు.

26
రిజ్వాన్, కోహ్లీ రికార్డులు బద్దలుకొట్టిన అభిషేక్

శ్రీలంక బౌలర్ దుష్మంత చమీరా వేసిన ఓవర్‌లో బౌండరీతో రిజ్వాన్ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. 34 పరుగులు అవసరమైన సమయంలో అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకు ముందు రిజ్వాన్ 2022 ఆసియా కప్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేశాడు. అదే టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ 276 పరుగులు సాధించాడు. ఈసారి అభిషేక్ 309 పరుగులతో వారి అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.

36
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలతో మరో రికార్డు కొట్టిన అభిషేక్ శర్మ

భారత్ తరఫున 25 బంతుల్లోపు అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోనూ అభిషేక్ చేరాడు. అభిషేక్ శర్మ ఆరు సార్లు 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

• సూర్యకుమార్ యాదవ్ – 7 సార్లు

• రోహిత్ శర్మ – 6 సార్లు

• అభిషేక్ శర్మ – 6 సార్లు

దీంతో అభిషేక్, సూర్యకుమార్, రోహిత్ శర్మ సరసన నిలిచాడు.

46
వరుసగా ముప్పైకి పైగా పరుగుల రికార్డు

ఈ మ్యాచ్‌లో సాధించిన 61 పరుగులతో అభిషేక్ మరో అరుదైన రికార్డులో చేరాడు. వరుసగా ఏడు మ్యాచ్‌లలో 30కి పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు రోహిత్ శర్మ (2021-22), రిజ్వాన్ (2021) మాత్రమే ఇది సాధించారు.

56
ఆసియా కప్ టీ20 టాప్ లో భారత ఓపెనర్ అభిషేక్

ఒకే ఆసియా కప్ టీ20 ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ టాప్ లో చేరాడు.

• 309 – అభిషేక్ శర్మ, భారత్, 2025 (6 ఇన్నింగ్స్)

• 281 – మొహమ్మద్ రిజ్వాన్, పాకిస్థాన్, 2022 (6 ఇన్నింగ్స్)

• 276 – విరాట్ కోహ్లీ, భారత్, 2022 (5 ఇన్నింగ్స్)

• 196 – ఇబ్రాహీం జద్రాన్, ఆఫ్ఘనిస్తాన్, 2022 (5 ఇన్నింగ్స్)

• 194 – బాబర్ హయాత్, హాంకాంగ్, 2016 (3 ఇన్నింగ్స్)

ఇక అభిషేక్, ఒకే టోర్నమెంట్‌లో 300 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు.

66
మరో ప్రపంచ రికార్డు కొట్టిన అభిషేక్ శర్మ

ఒక టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్‌లో 300కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ ఎనిమిదో ఆటగాడిగా చేరాడు. ఇంతకు ముందు ఈ ఘనత తిలకరత్నే దిల్షాన్, మహేలా జయవర్ధనే, విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఫిల్ సాల్ట్‌లకు దక్కింది.

• 331 – ఫిల్ సాల్ట్, ఇంగ్లాండ్ (2023)

• 319 – విరాట్ కోహ్లీ, భారత్ (2014)

• 317 – తిలకరత్నే దిల్షాన్, శ్రీలంక (2009)

• 316 – మొహమ్మద్ రిజ్వాన్, పాకిస్థాన్ (2022)

• 309 – అభిషేక్ శర్మ, భారత్ (2025)

ఇలాంటి అద్భుత ప్రదర్శనతో అభిషేక్ శర్మ తన మొదటి ఆసియా కప్‌లోనే సంచలన ప్రదర్శనతో రికార్డుల మోత మోగిస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories