ఆసియా కప్‌లో పాకిస్తాన్ తో ఆడటానికి భారత్ ఎన్ని సార్లు నో చెప్పింది?

Published : Aug 22, 2025, 09:32 PM IST

India Pakistan Asia Cup : ఇటీవలి కాలంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో రాబోయే ఆసియా కప్ 2025లో ఇరు దేశాల మ్యాచ్‌పై ఆసక్తి పెరుగుతోంది. అయితే, ఈ టోర్నీలో పలుమార్లు పాక్ తో ఆడటానికి భారత్ నో చెప్పింది.

PREV
15
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సూపర్ క్రేజ్

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లు అంటే క్రికెట్ ప్రపంచ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. రెండు దేశాల మ్యాచ్ లు ఎప్పుడూ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యం ఉండగా..  రాబోయే ఆసియా కప్ 2025 లో భారత్-పాకిస్తాన్ లు తలపడనున్నాయి.

అయితే, గత చరిత్రను గమనిస్తే ఆసియా కప్ లో పలుమార్లు పాకిస్తాన్ తో ఆడటానికి భారత్ నిరాకరించింది. ఈ నిర్ణయాలు ఆ సమయంలోని రాజకీయ, దౌత్య పరిస్థితుల కారణంగా తీసుకున్నారు.

DID YOU KNOW ?
ఆసియా కప్ లో అత్యధిక పరుగుల రికార్డు
ఆసియా కప్ (వన్డే) లో అత్యధిక పరుగుల రికార్డు సనత్ జయసూర్య పేరిట ఉంది. 25 మ్యాచ్‌ల్లో 1220 పరుగులు చేశాడు. ఆ తర్వాత సంగక్కర (1075 రన్స్), సచిన్ (971), రోహిత్ శర్మ (939), రహీమ్ (830) ఉన్నారు.
25
1986లో ఆసియా కప్ ను బహిష్కరించిన భారత్

ఆసియా కప్ రెండో ఎడిషన్ 1986లో శ్రీలంకలో జరిగింది. ఆ సమయంలో భారత్-శ్రీలంక మధ్య సంబంధాలు సరిగా లేవు. దీంతో భారత జట్టు టోర్నమెంట్‌కు వెళ్లకూడదని నిర్ణయించింది. ఫలితంగా భారత్ ఆసియా కప్ 1986లో పాల్గొనలేదు. దాంతోపాటు పాకిస్తాన్‌తో ఆ మ్యాచ్ జరగలేదు. ఈ నిర్ణయం క్రికెట్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారడంతో మళ్లీ భారత్ ఆసియా కప్ లో అన్ని దేశాలతో మ్యాచ్ లను ఆడింది.

35
1990-91లో మళ్లీ పాకిస్తాన్ మ్యాచ్‌కు నో చెప్పిన భారత్

ఆసియా కప్ నాల్గవ సీజన్ 1990-91లో నిర్వహించారు. ఆ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యంత కఠిన స్థితిలో ఉండటంతో భారత్ ఈ సీజన్‌ను బహిష్కరించింది. అందువల్ల మళ్లీ పాకిస్థాన్‌తో మ్యాచ్ జరగలేదు. ఇది భారత్ రెండవసారి పాకిస్తాన్ తో ఆసియా కప్‌లో ఆడటానికి నిరాకరించిన సందర్భంగా ఉంది.

45
2025 ఆసియా కప్‌లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లు జరిగేనా?

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ లో ఉంది. రెండు జట్లు సూపర్-4 దశలోకి చేరితే మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.

అయితే ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడబోమని స్పష్టం చేసింది. ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో మాత్రం రెండు దేశాలు తలపడుతున్నాయి.

ఈ సారి భారత్ మ్యాచ్ కు నో చెబితే పాకిస్తాన్ కు నేరుగా వాక్ ఓవర్‌తో రెండు పాయింట్లు లభిస్తాయి. అయితే, భారత్ ఈ దిశగా ఆలోచన చేయడం లేదని జట్టు ప్రకటనతో స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 14న జరగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరుగుతోంది.

55
ఆసియా కప్ లో అత్యంత విజయవంతమైన జట్టు భారత్

ఆసియా కప్ లో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరగ్గా, టీమిండియా 8 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక రెండో స్థానంలో ఉంది. శ్రీలంక 6 సార్లు ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక పాకిస్తాన్ రెండు సార్లు ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories