ఆసియా కప్ 2025: పాకిస్తాన్ తో ఆడకపోతే భారత్ కు కలిగే నష్టాలేంటి?

Published : Aug 22, 2025, 08:18 PM IST

India vs Pakistan: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. అయితే, ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో ఆడకపోతే టీమిండియాకు కూడా కొన్ని నష్టాలు కలుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఆసియా కప్ 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై అనిశ్చితి

ఆసియా కప్ 2025 కి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సర్వం సిద్ధం చేసింది. ఎప్పటిలాగే భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ పోరు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే 2025 ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌తో ఏ ద్వైపాక్షిక సిరీస్‌ను కూడా ఆడకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కానీ ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరగబోయే ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడతాయా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే, పాక్ తో భారత్ ఆడకపోతే కొన్ని నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి వివరాలు గమనిస్తే..

DID YOU KNOW ?
ఆసియా కప్: భారత్ vs పాకిస్తాన్
భారత జట్టు 8 సార్లు ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. పాకిస్తాన్ రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచింది.
25
పాకిస్తాన్‌కు ఉచిత పాయింట్లు

భారత్ పాకిస్తాన్‌తో ఆడకపోతే వాక్‌ఓవర్ రూపంలో పాకిస్తాన్‌కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి. ఇవి ఫైనల్‌కు అర్హత సాధించడానికి కీలకంగా మారవచ్చు. గ్రూప్ దశ లేదా సూపర్ 4 దశలో భారత్ ఆడకపోతే పాకిస్తాన్ నేరుగా ముందుకు వెళ్తుంది. ఫైనల్లో కూడా భారత్ ఆడకపోతే ట్రోఫీ పాకిస్తాన్ చేతుల్లోకే వెళ్ళిపోతుంది.

35
ఏసీసీలో భారత ప్రభావం తగ్గిపోవడం

1983లో స్థాపించిన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది. ప్రస్తుతం 30 సభ్య దేశాలతో కొనసాగుతున్న ఈ సంస్థకు పాకిస్తాన్‌కు చెందిన మొహ్సిన్ నక్వీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 

ఇప్పటివరకు ఏసీసీలో భారత్ ప్రభావవంతమైన స్థానం కలిగి ఉంది. అయితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే టోర్నమెంట్ ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో ఏసీసీలో భారత్ ప్రాధాన్యత దెబ్బతినే అవకాశం ఉంది.

45
ఐసీసీలో బీసీసీఐ కి ఎదురుదెబ్బ తగలవచ్చు

భారత్ పాకిస్తాన్‌తో ఆడకపోతే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రభావం తగ్గిపోవచ్చు. ప్రస్తుతం ఐసీసీలో 12 సభ్య దేశాలు ఉన్నాయి, వాటిలో ఐదు దేశాలు ఆసియాకు చెందినవే. 

ఐసీసీ అధ్యక్షుడు జైషా పదవికి పాకిస్తాన్ బోర్డు కూడా మద్దతు ఇచ్చింది. ఇలాంటి సమయంలో భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్ లను బహిష్కరించడంతో బీసీసీఐ స్థానం బలహీనత వైపు వెళ్లవచ్చు.

55
భారత్ పై బ్రాడ్‌కాస్టర్ల అసంతృప్తి

ఆసియా కప్ 2025 ప్రసార హక్కులు 170 మిలియన్ డాలర్లకు (దాదాపు 1,500 కోట్ల రూపాయలు) విక్రయించారు. ఇందులో భారత్-పాకిస్తాన్ పోరు అత్యంత ఆదాయాన్ని తీసుకొచ్చే మ్యాచ్‌గా పరిగణిస్తున్నారు. 10 సెకన్ల ప్రకటనకు ఏకంగా 25 నుండి 30 లక్షల రూపాయల వరకు వసూలవుతోంది. 

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే ప్రసార హక్కులు కొనుగోలు చేసిన సంస్థలు నిరాశ చెందుతాయి. సోనీ పిక్చర్స్ 1500 కోట్ల రూపాయలతో వచ్చే నాలుగు ఆసియా కప్ టోర్నమెంట్ల హక్కులు సొంతం చేసుకుంది. మ్యాచ్ జరగకపోతే బీసీసీఐ పై నమ్మకం తగ్గిపోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories