
Top 10 Fastest Triple Centuries: టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించడం అంటే ఆ ప్లేయర్ అసాధారణమైన ఆటతీరు, అసాధ్యమైన సహనం కలిగి ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అయితే కొందరు ఆటగాళ్లు అత్యుత్తమ ఫామ్‌తో ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించారు. దుమ్మురేపే ఆటతో సెంచరీల మోత మోగించారు. క్రికెట్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీలు కొట్టిన టాప్ 10 ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా? ఆ వివరాలు గమనిస్తే..
టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ 2007-08లో చెన్నైలో దక్షిణాఫ్రికా పై టెస్ట్ మ్యాచ్‌లో 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్ లో 304 బంతుల్లో 319 పరుగులు చేశాడు. సెహ్వాగ్ తన ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 42 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. సెహ్వాగ్ స్ట్రైక్ రేట్ 104.93 ఉండడం విశేషం.
ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ 2024లో పాకిస్తాన్‌పై ముల్తాన్ టెస్ట్‌లో 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 322 బంతుల్లో 317 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 29 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. 98.45 స్ట్రైక్ రేట్‌తో తన ఆటను కొనసాగించాడు.
ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మన్ హెడెన్ 2003-04లో జింబాబ్వేపై పర్థ్ టెస్ట్‌లో 362 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో అతను 380 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 38 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్ టెస్ట్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరుగా నిలిచింది.
మరోసారి సెహ్వాగ్ తనదైన దూకుడు ఆటతో మరో ట్రిపులు సెంచరీ బాదాడు. 2003-04లో పాకిస్తాన్‌పై ముల్తాన్ టెస్ట్‌లో 364 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 309 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 39 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 82.40గా ఉంది.
భారత ఆటగాడు కరుణ్ నాయర్ 2016లో ఇంగ్లాండ్‌పై చెన్నై టెస్ట్‌లో 381 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 381 బంతుల్లోనే 303 పరుగులు చేసి, తన తొలి సెంచరీని ట్రిపులు సెంచరీగా మార్చిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 32 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు.
ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 2019లో పాకిస్తాన్‌పై అడిలైడ్ టెస్ట్‌లో 389 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 335 పరుగులు చేశాడు. వార్నర్ ఇన్నింగ్స్‌లో 39 ఫోర్లు, ఒక్క సిక్సర్ బాదాడు.
7. క్రిస్ గేల్ – 393 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ
వెస్టిండీస్ పవర్‌హౌస్ క్రిస్ గేల్ 2010లో శ్రీలంకపై గాలేలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 393 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 333 పరుగుల తన ఇన్నింగ్స్ లో 34 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు.
వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా 2004లో ఇంగ్లాండ్‌పై 404 బంతులు ఆడి టెస్టుల్లో అత్యధిక స్కోర్ ను సాధించాడు. తన ట్రిపుల్ సెంచరీని తర్వాత 400 పరుగులకు చేర్చాడు. లారా ఇన్నింగ్స్‌లో 43 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
1974లో వెస్టిండీస్ ఆటగాడు లారెన్స్ రో బ్రిడ్జ్‌టౌన్‌లో ఇంగ్లాండ్‌పై 430 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 302 పరుగులు చేశాడు. 36 ఫోర్లు, ఒక్క సిక్సర్ బాదాడు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ 2002లో న్యూజిలాండ్‌పై లాహోర్ టెస్ట్‌లో 436 బంతుల్లో 329 పరుగులు చేశాడు. ఇందులో 38 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అతను ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి పాకిస్థానీ ప్లేయర్.