IND vs PAK: ఆసియా కప్ ఫైనల్ భారత్ vs పాక్ మ్యాచ్ ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? ఇరు జట్లు ఇవే

Published : Sep 28, 2025, 12:04 PM IST

IND vs PAK: 41 ఏళ్లలో తొలిసారి ఆసియా కప్ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరగనుంది? మ్యాచ్ టైమ్, లైవ్‌స్ట్రీమింగ్, రెండు జట్ల ప్లేయింగ్ 11 వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఆసియా కప్ 2025 ఫైనల్ : ఇండియా vs పాకిస్తాన్

India vs Pakistan : ఆసియా కప్ 2025 తన చివరి దశకు చేరుకుంది. ఈ సారి ఫైనల్ మ్యాచ్ ప్రత్యేకతను సంతరించుకుంది. టోర్నమెంట్‌ 41 ఏళ్ల చరిత్రలో తొలిసారి భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఈ పోరులో కేవలం ట్రోఫీ కోసం కాకుండా, గౌరవం, ప్రతిష్ట కోసం కూడా పోరాటం కానుంది. అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోరాటం ఇదే. ఎంతో ఉత్కంఠను రేపుతున్న భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

25
IND vs PAK: ఆసియా కప్ 2025 ఫైనల్ భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

• మ్యాచ్‌: భారత్ vs పాకిస్తాన్ (ఆసియా కప్ 2025 ఫైనల్)

• తేదీ: ఆదివారం, 28 సెప్టెంబర్ 2025

• వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

• టాస్ సమయం: సాయంత్రం 7:30 IST

• మ్యాచ్ ప్రారంభం: రాత్రి 8:00 IST

35
ఆసియా కప్ 2025 ఫైనల్: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ లైవ్‌స్ట్రీమింగ్ వివరాలు

ఆసియా కప్ ఫైనల్ కు సర్వం సిద్ధమైంది. భారత్‌, పాకిస్థాన్ మధ్య జరిగే ఈ హై-వోల్టేజ్ పోరును అభిమానులు Sony Sports Network లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులు SonyLIV, FanCode యాప్‌లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మ్యాచ్‌ను వీక్షించవచ్చు. అలాగే, DD Sports ఛానల్‌లో ఈ మ్యాచ్‌ను ఫ్రీగా చూడవచ్చు.

45
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్ల ప్రస్థానం

భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో అజేయంగా ముందుకు సాగింది. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లు, అలాగే సూపర్ 4 దశలో కూడా మూడు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

మరోవైపు, పాకిస్థాన్ జట్టు గ్రూప్‌ దశలో రెండు విజయాలు సాధించగా, సూపర్ 4 దశలో కూడా రెండు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌ చేరింది. ఈ ప్రస్థానమే ఫైనల్ పోరుకు మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఈ టోర్నీలో రెండు సార్లు భారత్, పాక్ లు తలపడ్డాయి. రెండు మ్యాచ్ లలో కూడా భారత్ అద్భుతమైన ఆటతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. మూడో సారి ఇప్పుడు ఫైనల్ లో తలపడుతున్నాయి.

55
ఆసియా కప్ 2025 ఫైనల్: భారత్ vs పాకిస్తాన్ జట్లు ఇవే

భారత్‌ జట్టు:

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ జట్టు:

సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఖుష్‌దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సామ్ అయ్యూబ్, షాహీన్ షా అఫ్రిది.

ఈ పోరు ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ తొలిసారి తలపడుతున్న చరిత్రాత్మక ఘట్టం కావడంతో, అభిమానుల్లో ఉత్సాహం, ఉత్కంఠ నెలకొంది.

Read more Photos on
click me!

Recommended Stories