IND vs AUS T20 Series: ప్ర‌తీకారం తీర్చుకునేనా? ఇండియా vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. ఫ్రీ 'లైవ్ స్ట్రీమింగ్'..

First Published Nov 22, 2023, 6:00 PM IST

IND vs AUS 1st T20I Live Streaming: భారత్ vs ఆస్ట్రేలియా మ‌ధ్య మొదటి టీ20 మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో గురువారం జ‌ర‌గ‌నుంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ద్వైపాక్షిక టీ20 కోసం ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు వేదిక‌కు చేరుకున్నాయి.
 

India vs Australia 1st T20I Live: భార‌త్-ఆస్ట్రేలియాల మ‌ధ్య గురువారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీ టీ20 వరల్డ్ క‌ప్ కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నవంబర్ 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా టీ20 ఐదు మ్యాచ్ ల‌ సిరీస్ లో తలపడనున్నాయి.
 

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా తొలి టీ20 జరగనుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముగియనుంది. 

ఐసీసీ వన్డే వరల్డ్ క‌ప్ లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లలో చాలా మందికి ఈ టీ20 సిరీస్ కు విశ్రాంతినిచ్చారు. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ టీం ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించనుండగా, మాథ్యూ వేడ్ కు ఆస్ట్రేలియాకు సారథ్యం వహించే అవకాశం లభించింది.
 

అంత‌కుముందు, 2023 సెప్టెంబర్ లో ఆస్ట్రేలియా భారత్ తో మూడు వన్డేల సిరీస్ ఆడింది. తొలి రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించగా, మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 

2023 ప్రపంచ కప్ కోసం ఇరు జట్ల సన్నాహకాల్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ జరిగింది. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ద్వైపాక్షిక టీ20 అంతర్జాతీయ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలను ఇరు జ‌ట్లు ప్ర‌క‌టించాయి. 

భారత్-ఆస్ట్రేలియా టీ20 వివ‌రాలు గ‌మ‌నిస్తే.. నవంబర్ 23న భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.  ఇరు జట్ల మధ్య తొలి టీ20 గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి విశాఖపట్నంలోని డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. 
 

భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ను స్పోర్ట్స్ 18 నెట్వర్క్ లైవ్ ప్రసారం చేయనుంది. టీవీ 18, స్పోర్ట్స్ 18, కలర్స్, కలర్స్ సినీప్లెక్స్ సూపర్ హిట్స్ లో కూడా మ్యాచ్ ల‌ను వీక్షించవచ్చు.
 

ఇక భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా చూడాల‌నుకునే వారికి జియో నెట్ వ‌ర్క్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సిరీస్ ను జియో సినిమాలో ఉచితంగా వీక్షించ‌వచ్చని తెలిపింది. 
 

భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు భార‌త్ జ‌ట్టు ఇదే.. : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.

click me!