David Warner
David Warner: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రదర్శన ప్రశంసనీయం. ఈ మెగా టోర్నమెంట్ లో క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు కీలక ఇన్నింగ్స్ లు అందించాడు. దీంతో కంగారూలు ఆరోసారి చారిత్రాత్మక విజయాలు అందుకున్నారు.
David Warner
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 మెగా టోర్నమెంట్ సమయంలో అతని వయసు 37 సంవత్సరాలు అయినప్పటికీ.. అలా కనిపించలేదు. మైదానంలో పరిగెత్తే 27 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడు. ఇప్పుడు ఈ ఆల్ రౌండర్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
David Warner
మెగా టోర్నీకి ముందు తన వయసు గురించి మాట్లాడే వారికి మ్యాచ్ సందర్భంగా తన బ్యాట్ తో డేవిడ్ వార్నర్ బదులిచ్చాడు. 2023 ప్రపంచకప్ లో కంగారూల తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. 2023 ప్రపంచకప్ లో వార్నర్ 48.63 సగటుతో మొత్తం 535 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా జట్టులో అగ్రశ్రేణి బ్యాట్స్ మన్ గా ఎదిగాడు.
David Warner
ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ముగియడంతో తన క్రికెట్ కెరీర్, రిటైర్ మెంట్ గురించి వార్తలు రావడంతో వార్నర్ స్పందించాడు. ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా తన కెరీర్ గురించి అప్డేట్ ఇచ్చాడు. తన పోస్టు తో క్రికెట్ అభిమానులకు సంతోషాన్ని అందించాడు. పలు మీడియా సంస్థలు ప్రపంచకప్ ముగిసిన తర్వాత తన ప్రత్యేక ప్రదర్శనతో.. "వార్నర్ వరల్డ్ కప్ కెరీర్ పెద్ద రికార్డుతో ముగిసింది" అంటూ పలు కథనాలు రాసుకొచ్చాయి.
ఇదే తరహాలో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఒక పోస్టు చేసింది. దీనిపై ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ వార్నర్ స్పందించాడు. "ఎవరు చెప్పారు నేను నా కెరీర్ ను ముగించానని" అంటూ ప్రశ్నించాడు. ఈ పోస్టుతో తన ఇప్పట్లో రిటైర్ కావడం లేదనే సంకేతాలు పంపాడు.
కాగా, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 56.55 యావరేజ్, 101.46 స్ట్రైక్ రేటుతో 1527 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, ఐదు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. వార్నర్ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ 178 పరుగులు.