Team India: భారత్ తో ఆఫ్ఘనిస్తాన్ తొలి ద్వైపాక్షిక సిరీస్‌.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..

First Published | Nov 22, 2023, 4:58 PM IST

India Vs Afghanistan T20 Series: ఆఫ్ఘనిస్తాన్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో భార‌త్ టీ20 సిరీస్ లో ఆడ‌నుంది.  
 

India Vs Afghanistan T20 Series 2024 Schedule: ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాయి. ఓ వైపు భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో టీ20 సిరీస్ ఆడనుండగా, మరోవైపు భారత్ ఇప్పటి వరకు ఒక్క వన్డే, టీ20 సిరీస్ కూడా ఆడని జట్టు భారత్ కు రానుంది. ఈ జట్టు మరెవరో కాదు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు.
 

ఆఫ్ఘనిస్తాన్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జనవరిలో అఫ్గానిస్థాన్ జట్టు భారత్లో పర్యటిస్తుందని బోర్డు స్వయంగా ప్రకటించింది.
 


నిజానికి భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ గురించి చాలా కాలంగా వార్తలు వ‌స్తున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ కూడా అనౌన్స్ చేశారు. జనవరిలో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20లు జరగనున్నాయి. ఈ పర్యటనకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. జనవరి 11, 14, 17 తేదీల్లో అఫ్గానిస్థాన్ మూడు టీ20లు ఆడనుంది.
 

మూడు టీ20ల సిరిస్ లో భాగంగా తొలి మ్యాచ్ జనవరి 11న మొహాలీలో, రెండు, మూడో మ్యాచ్లు జనవరి 14, 17 తేదీల్లో ఇండోర్, బెంగళూరులో జరుగుతాయి. ఇరు దేశాలు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటం ఇదే తొలిసారి.
 

ఐసీసీ టోర్నమెంట్లు లేదా ఆసియా కప్ ల‌లో పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే అఫ్గానిస్తాన్, భారత్ తలపడ్డాయి. అయితే ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ జరిగింది.
 

Pakistan vs Afganistan

ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2023 కోసం ఇటీవల భారత్ లో పర్యటించిన అఫ్గానిస్థాన్ ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లపై చిరస్మరణీయ విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ప్రపంచకప్ లో అఫ్గానిస్థాన్ ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. 

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 షెడ్యూల్ ఇలా..

మొదటి మ్యాచ్: 11 జనవరి 2024, మొహాలీలోని పీసీఏ స్టేడియం
రెండో మ్యాచ్: 14 జనవరి 2024, ఇండోర్ హోల్కర్ స్టేడియం
మూడో మ్యాచ్- 17 జనవరి 2024, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం
 

Latest Videos

click me!