ధోని మాస్టర్ స్ట్రోక్ అదిరిందిగా.. అశ్విన్ స్థానంలో మాజీ SRH ఆటగాడు.. ఎవరంటే.?

Published : Oct 23, 2025, 05:40 PM IST

IPL 2026: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ట్రేడింగ్ చేసుకోనుందని టాక్. 

PREV
15
గుజరాత్ టూ చెన్నై ట్రేడ్..

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌కు ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి లోకల్ ప్లేయర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ట్రేడ్ చేసుకోనున్నట్టు సమాచారం. ఐపీఎల్ 2026కు ముందు వాషింగ్టన్ సుందర్‌ను రూ. 3.2 కోట్లకు చెన్నైతో ట్రేడ్ చేసేందుకు గుజరాత్ టైటాన్స్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సుందర్ బదులుగా ఎలాంటి ప్లేయర్‌ను చెన్నై ట్రేడ్ చేయట్లేదని టాక్.

25
అశ్విన్ స్థానంలో..

ఐపీఎల్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చాడు. దీంతో అశ్విన్ స్థానానికి సుందర్ మంచి రీప్లేస్‌మెంట్ అవుతాడని చెన్నై యాజమాన్యం భావిస్తోంది. 38 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ పదేళ్ల తర్వాత ఐపీఎల్ 2025కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఎన్నో అంచనాలతో మెగా ఆక్షన్‌లోకి అడుగుపెట్టిన అశ్విన్‌ను చెన్నై రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. లోకల్ ప్లేయర్ కావడంతో ఈ వెటరన్ స్పిన్నర్‌పై సీఎస్కే యాజమాన్యం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

35
ఘోరంగా విఫలం..

45
స్పిన్ మాంత్రికుడిని..

అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వాషింగ్టన్ సుందర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటోంది. ఇక గుజరాత్ టైటాన్స్ కూడా సుందర్‌ను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయింది. దీంతోనే చెన్నైతో ట్రేడ్ డీల్‌కు గుజరాత్ ఒప్పుకుందట. వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ అరంగేట్రం 2017లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌తో జరిగింది.

55
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌కి..

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు వాషింగ్టన్ సుందర్. గుజరాత్ తరఫున ఈ ఆల్ రౌండర్‌కు కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఆరు మ్యాచ్‌ల్లోనూ సుందర్ 133 పరుగులు చేసి, రెండు వికెట్లు పడగొట్టాడు. ఇవి చెప్పుకోదగ్గ గణాంకాలు కాకపోగా.. సుందర్ అంతకముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్‌లో జరగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories