హార్దిక్ కంటే ఏడేళ్లు చిన్న.. ఎవరీ మహికా శర్మ?

Published : Oct 11, 2025, 08:26 PM IST

Hardik Pandya Mahieka Sharma: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన కొత్త రిలేషన్‌షిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించారు. తనకంటే ఏడేళ్లు చిన్న అయిన ఢిల్లీ మోడల్ మహికా శర్మతో ప్రేమను అందరికీ చెప్పేశాడు.

PREV
15
ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్ ప్రేమ ప్రకటన

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల తర్వాత ఇప్పుడు తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో మోడల్ మహికా శర్మతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. ఆ చిత్రాల్లో ఇద్దరూ బీచ్‌లో సంతోషంగా గడుపుతున్నట్లు కనిపించారు. హార్దిక్ ఓవర్‌సైజ్ జాకెట్, షార్ట్‌, చప్పలు ధరించి ఉన్నాడు. మాహికా మాత్రం తెల్లని షర్ట్‌డ్రెస్‌లో ఉన్నారు. హార్దిక్ తన చేయిని మహికా భుజంపై ఉంచిన ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించాడు. అలాగే, మహికా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో హార్దిక్ ఫోటోను షేర్ చేశారు.

25
Hardik Mahieka : సోషల్ మీడియాలో అభిమానుల కామెంట్ల వర్షం

ఈ పోస్ట్ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అభిమానులు కామెంట్ల వర్షంతో ఈ కొత్త జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. "హార్దిక్ మళ్లీ సంతోషంగా కనిపిస్తున్నాడు.. ఈ ఫోటో ఆయన జీవితంలో కొత్త ప్రారంభం" అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో మహికా, హార్దిక్ రిలేషన్‌పై గత కొన్ని నెలలుగా ఉన్న ఊహాగానాలు నిజమని అభిమానులు తేల్చేశారు.

35
Mahieka Sharma: మహికా శర్మ ఎవరు?

మహికా శర్మ వయస్సు 24 సంవత్సరాలు. ఆమె న్యూఢిల్లీలోని నేవీ చిల్డ్రెన్ స్కూల్‌లో చదివారు. గుజరాత్‌లోని పండిట్ దీన్‌దయాల్ పెట్రోలియం యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో కమ్యూనిటీ సైకాలజీలో చదువుకుంది.

వృత్తి పరంగా ఆమె ఒక సక్సెస్ ఫుల్ మోడల్, నటిగా గుర్తింపు పొందింది. మానీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే, తరుణ్ తహిలియానీ వంటి ప్రముఖ డిజైనర్ల కోసం ర్యాంప్‌వాక్ చేసింది. ఆమె ELLE, Grazia మాగజైన్ కవర్‌పేజీల్లో కూడా కనిపించింది. "ఇంటు ది డస్క్" "పీఎం నరేంద్ర మోడీ" వంటి పలు చిత్రాల్లో కూడా నటించింది.

45
హార్దిక్, మహికా రిలేషన్..

హార్దిక్, మహికా మధ్య సంబంధం గురించి ఊహాగానాలు కొన్ని నెలల ముందే మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ పంచుకున్న పోస్టుల్లో అభిమానులు చిన్న చిన్న హింట్స్ గమనించారు. మహికా ధరించిన లియోపర్డ్ ప్రింట్ రోబ్, హార్దిక్ ధరించినదానితో సమానంగా ఉండటం, ఆమె వేలిపై 33 నంబర్ ఉండటం.. అది హార్దిక్ జెర్సీ నంబర్ కావడం.. ఇలా కొన్ని ఈ ప్రేమకథకు సంకేతాలుగా మారాయి.

శుక్రవారం (అక్టోబర్ 10న) వీరిద్దరూ విమానాశ్రయంలో కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఇద్దరూ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించగా, వారి కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది.

55
నటాషా స్టాంకోవిక్ తో హార్దిక్ విడాకులు

హార్దిక్ పాండ్యా గతంలో సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ తో ప్రేమలో ఉన్నారు. 2020 నుంచి కలిసి జీవించిన వీరు 2023లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే 2024లో విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన ఒక సంవత్సరం మూడు నెలల తరువాత హార్దిక్ తన కొత్త ప్రేమను ప్రపంచానికి చెప్పారు. గతంలో గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ లవ్ లో ఉన్నారనే రూమర్లు కూడా వినిపించాయి. కానీ, ఇప్పుడు హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో తన కొత్త లవ్ ఎవరో చెప్పకనే చెప్పాడు.

Read more Photos on
click me!

Recommended Stories