భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ ప్రస్తుతం బాగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె తరచూ హార్దిక్‌తో కలిసి కనిపిస్తోంది. అయితే హార్దిక్ కొత్త ప్రేయసి సంపాదన విషయంలో కూడా చాలా ముందుంది. ఆమె ఆస్తులు, నెల సంపాదన ఎంతో తెలుసా?
Hardik Pandya Girlfriend Mahieka Sharma : భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఆటతీరు అద్భుతంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం జట్టులో అత్యుత్తమ ఆల్రౌండర్ అతడే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతడు ధనాధన్ బ్యాటింగ్, సూపర్ బౌలింగ్ తో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఇలా కేవలం ఆటతోనే కాదు వ్యక్తిగత వ్యవహారాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు పాండ్యా. మొదట సెర్బియన్ మోడల్ నటాషాతో పెళ్లి, విడాకులతో వార్తల్లో నిలిచిన పాండ్యా ఇప్పుడు మరో గర్ల్ ప్రెండ్ మహికా శర్మతో చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తున్నాడు.
ఇప్పటికే చాలాసార్లు మహికాతో కలిసున్న హార్దిక్ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. కొన్నిసార్లు మహికాతో కలిసి కారు కడుగుతూ, మరికొన్నిసార్లు ఆమెను కారు వరకు డ్రాప్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌కు సపోర్ట్ గా మహికా స్టేడియంలో కనిపించింది. పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఇలా హార్దిక్ ప్రేయసిగా మహికా అందరికీ పరిచయం అయ్యారు. కానీ ఈమె ఎవరు? అనేది చాలామందికి తెలియదు. సంపాదన విషయంలో కూడా మహికా తక్కువేమీ కాదు. ఆమె గురించి, సంపాదన గురించి ఇక్కడ తెలుసుకుందాం.
25
హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ ఏం చేస్తుంది?
హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ వృత్తిరీత్యా ఒక మోడల్, నటి. ఆమె మోడలింగ్‌తో పాటు ఫిట్‌నెస్ నిపుణురాలు కూడా. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని ఫాలో అయ్యేవారికి మరీముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు చూసేవారికి మహికా సుపరిచితమే. హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్ చాలా మంది పెద్ద ఫ్యాషన్ డిజైనర్ల కోసం కూడా పనిచేసింది. ఆమె రాపర్ రాగా మ్యూజిక్ వీడియోలో, వివేక్ ఒబెరాయ్‌తో కలిసి పీఎం నరేంద్ర మోదీ బయోపిక్‌లో కూడా పనిచేసింది. ఫిట్‌నెస్ మోడల్‌గా కూడా సోషల్ మీడియాలో ఆమె ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచింది. ఆమె తన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది… ఇలాకూడా ఆమె చాలామందికి పరిచయం అయ్యారు.
35
హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ మహికా ఆస్తులెన్ని?
ఇక మహికా శర్మ సంపాదన విషయానికొస్తే కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం... ఆమె మొత్తం ఆస్తి రూ. 3.20 కోట్లుగా చెప్పబడుతోంది. ఆమె సంపాదనకు ప్రధాన వనరులు మోడలింగ్, ఫిట్‌నెస్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు. మహికా తనిష్క్, యునిక్లో, వివో వంటి పెద్ద బ్రాండ్ల కోసం యాడ్స్ చేసింది. ఈ పనుల ద్వారా ఆమెకు మంచి మొత్తంలో డబ్బు అందుతుంది. ఆమె మనీష్ మల్హోత్రా, తరుణ్ తహిలియాని వంటి పెద్ద డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ కూడా చేసింది, దీని కోసం ఆమె పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంది.
హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ మొత్తం నికర విలువ రూ. 3 కోట్ల 20 లక్షలు. సాధారణంగా 3 కోట్ల రూపాయల నికర విలువ ఉన్న వ్యక్తి నెలవారీ ఆదాయం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది, ఉదాహరణకు - డబ్బు ఎక్కడి నుండి వచ్చింది (వడ్డీ, అద్దె లేదా వ్యాపారం), దాన్ని ఎలా పెట్టుబడి పెట్టారు వంటివి. కానీ ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉంటే నెలకు సుమారు రూ. 1.75 లక్షల నుండి రూ. 2.12 లక్షల వరకు వడ్డీ రావచ్చు.
55
సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్
మహికా శర్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానుల కోసం ఏదో ఒకటి కొత్తగా చేస్తూ కనిపిస్తుంది. ఆమెకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు.
హార్దిక్‌తో సంబంధం బయటపడిన తర్వాత మహికా రీచ్ మరింత పెరిగింది. ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫోటోలు అభిమానుల హృదయాల్లో మంటలు రేపుతాయి. ఈ లెక్కన చూస్తే మహికా నెల సంపాదన రూ. 1 నుండి 2 లక్షల వరకు ఉండవచ్చు.