Published : Dec 24, 2025, 03:08 PM ISTUpdated : Dec 24, 2025, 03:14 PM IST
ICC Mens T20 World Cup 2026 : రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఏ ఐపీఎల్ జట్టు నుంచి ఎంతమంది ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకున్నారో చూద్దాం.
స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మరో వరల్డ్ కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపించనున్నారు. ఇప్పటికే పొట్టి క్రికెట్ లో భారత జట్టుకు అనేక విజయాలు అందించి తానేంటో నిరూపించుకున్నారు. తన కెప్టెన్సీలో మొదటి టీ20 వరల్డ్ గెలవాలన్న కసితో ఉన్నాడు.
211
మరోసారి కప్ గెలవడానికి సిద్ధమైన భారత్
ఇప్పటికే యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టును చూస్తే టీమిండియా మరోసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను గెలుస్తుందనే నమ్మకం భారత అభిమానులకు కలుగుతోంది. ఆటగాళ్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్వదేశంలో పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భావిస్తున్నారు.
311
టీ20 ప్రపంచకప్‌కు ఏ ఐపిఎల్ టీం నుండి ఎవరు?
ఈసారి టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఏ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) జట్టు నుంచి ఎవరు ఎంపికయ్యారు అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఏ ఐపిఎల్ టీం నుండి ఎక్కువమంది ప్లేయర్లు ఎంపికయ్యారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
గత ఐపిఎల్ విజేత ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జె) జట్ల నుంచి ఒక్క ఆటగాడు కూడా ఈసారి ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టులో చోటు దక్కించుకోలేదు.
511
1. గుజరాత్ టైటాన్స్: 01
గుజరాత్ టైటాన్స్ (GJ) నుంచి స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు టీ20 వరల్డ్ కప్ టీంలో చోటు దక్కలేదు.
611
2. పంజాబ్ కింగ్స్: 01
పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందిన ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో ఇతను సమర్థంగా బౌలింగ్ చేస్తాడు. అందుకే ఇతడిని బిసిసిఐ ఎంపిక చేసింది.
711
3. చెన్నై సూపర్ కింగ్స్: 02
వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ కు ఈసారి టీ20 వరల్డ్ ఆడే అవకాశం దక్కింది. ఇక, ఆల్‌రౌండర్ శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలో చోటు సంపాదించాడు.
811
4. సన్‌రైజర్స్ హైదరాబాద్: 02
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన ధనాధన్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మకు టీ20 ప్రపంచకప్ టీంలో చోటు దక్కింది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.
911
5. ఢిల్లీ క్యాపిటల్స్: 02
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వరల్డ్ కప్ లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా చోటు దక్కించుకున్నాడు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో ఉన్నాడు.
1011
06. కోల్‌కతా నైట్ రైడర్స్: 03
కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, మ్యాచ్ ఫినిషర్ రింకూ సింగ్, యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా.. ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
1111
07. ముంబై ఇండియన్స్: 04
అంచనాలకు తగ్గట్టే ముంబై ఇండియన్స్ నుంచి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా.. నలుగురు ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.