Cricket: పాములు, కీట‌కాలు, చీమ‌లు.. వీటివ‌ల్ల కూడా మ్యాచ్‌లు ఆగిపోయాయ‌ని తెలుసా.?

Published : Dec 18, 2025, 05:47 PM IST

Cricket: భారత్‌-ద‌క్షిణాఫ్రికాల మ‌ధ్య బుధ‌వారం జ‌ర‌గాల్సిన నాల్గో టీ20 మ్యాచ్ ర‌ద్ద‌యిన విష‌యం తెలిసిందే. పొగ‌మంచు కార‌ణంగా మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. అయితే కొన్ని వింత కార‌ణాలతో కూడా మ్యాచ్‌లు ర‌ద్ద‌యిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని తెలుసా.? 

PREV
15
పొగ‌మంచుతో ర‌ద్ద‌యిన మ్యాచ్

లక్నోలో జరగాల్సిన భారత్–దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ పొగ‌మంచు కారణంగా పూర్తిగా రద్దయ్యింది. మ్యాచ్ రోజు సాయంత్రం 6.30కి టాస్ జరగాల్సి ఉండగా, మైదానం మొత్తం దట్టమైన పొగమంచుతో నిండిపోయింది. పరిస్థితిని గమనించిన అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. ప్రతి అరగంటకు పిచ్‌ను పరిశీలించారు. రాత్రి 9.25 వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మూడు గంటల పాటు ఆట నిలిచిన తరువాత మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. మ‌రికొన్ని వింత కార‌ణాల‌తో కూడా మ్యాచ్‌లు ఆగిపోయిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి.

25
సూర్యకాంతి వల్ల ఆటకు బ్రేక్

వర్షం, బ్యాడ్‌లైట్‌ మాత్రమే కాదు… సూర్యకాంతి కూడా ఆటకు అడ్డంకిగా మారిన సందర్భాలున్నాయి. 2019లో భారత్–న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ సందర్భంగా ఇదే జరిగింది. న్యూజిలాండ్‌లోని నేపియర్ మెక్‌లీన్ పార్క్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో సూర్యకాంతి నేరుగా బ్యాట్స్‌మన్ కళ్లపై పడటంతో ఆటను అరగంట పాటు నిలిపివేశారు. అంపైర్లు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

35
మైదానంలోకి కీటకాలు, తేనెటీగలు

క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోయిన అరుదైన‌ కారణాల్లో ఇది ఒకటి. గత ఏడాది సౌతాఫ్రికాలోని సెంచూరియన్ లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ సమయంలో ఎగిరే చీమల గుంపు మైదానాన్ని కప్పేసింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. అలాగే 2017లో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన దక్షిణాఫ్రికా–శ్రీలంక వన్డే మ్యాచ్‌లో తేనెటీగల గుంపు మైదానంపైకి రావడంతో గంటకు పైగా ఆట ఆగిపోయింది.

45
పిచ్‌పై కారు, గ్రౌండ్‌లో పాము

దేశవాళీ క్రికెట్‌లో మరింత వింత సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ సమయంలో ఓ వ్యక్తి నేరుగా కారు తీసుకుని పిచ్‌పైకి వచ్చాడు. ఆటగాళ్లు, అంపైర్లు ఆపినా వినకుండా కారు నడపడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో అప్పటి ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు. ఈ సంఘటన ఢిల్లీ పాలం మైదానంలో జరిగింది. ఇక శ్రీలంకలో పలు సందర్భాల్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాములు గ్రౌండ్‌లోకి వచ్చిన ఘటనలు ఉన్నాయి. కుక్కలు వంటి జంతువులు మైదానంలోకి రావడంతో కూడా ఆటను కొద్దిసేపు ఆపిన సందర్భాలు ఉన్నాయి.

55
ఫైర్ అలారం

2017లో ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్–క్వీన్స్‌లాండ్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఒక్కసారిగా ఫైర్ అలారం మోగింది. కారణం ఏంటంటే… ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ టోస్ట్ కాలిపోవడం. దాంతో ఫైర్ బ్రిగేడ్ కూడా స్టేడియానికి చేరుకుంది. 2007 కౌంటీ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో గ్రేవీ కాలిపోవడంతో స్టేడియాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఈ ఏడాది హోబార్ట్ హరికేన్స్–అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ విరామ సమయంలో రోలర్ కింద బంతి రావడంతో పిచ్‌లో గుంత ఏర్పడింది. దాంతో మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories