హార్దిక్ పాండ్యా కొత్త బ్లాండ్ హెయిర్‌స్టైల్.. సోషల్ మీడియా షేక్

Published : Sep 05, 2025, 11:02 PM IST

Hardik Pandya Blonde Hairstyle: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త బ్లాండ్ హెయిర్‌స్టైల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆసియా కప్ 2025కు ముందు అభిమానులు మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు.

PREV
15
ఆసియా కప్ 2025కు ముందు హార్దిక్ పాండ్యా స్టైల్ హంగామా

భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త బ్లాండ్ హెయిర్‌స్టైల్‌తో సోషల్ మీడియాలో రచ్చ రేపాడు. శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్ చేస్తూ “New me!” అని పేర్కొన్నాడు. ఈ కొత్త లుక్‌పై అభిమానులు మీమ్స్, కామెంట్లతో స్పందిస్తున్నారు. ఆసియా కప్ 2025కు ముందు ఆయన చేసిన ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వైరల్ గా మారింది.

25
ఆసియా కప్ 2025లో టీమిండియా

ఆసియా కప్ 2025లో భారత జట్టు టైటిల్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు. సెప్టెంబర్ 10, బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య యుఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. 

గ్రూప్ Aలో భారత్‌తో పాటు యుఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో విజయంతో ప్రచారం మొదలుపెట్టి, పాకిస్తాన్, ఒమన్‌పై  గెలుపు సాధించాలనే వ్యూహాలు భారత్ సిద్ధం చేసుకుంది. భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ ముందుకు నడిపించనున్నారు.

35
హర్దిక్ పాండ్యా హెయిర్ స్టైల్ ట్రెండ్

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆటలోనే కాకుండా తన స్టైలింగ్‌తో కూడా ఎప్పుడూ ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షిస్తుంటాడు. గతంలో కూడా పలు విభిన్నమైన హెయిర్‌స్టైల్‌లతో వార్తల్లో నిలిచాడు. 2017లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా ఒకవైపు పూర్తిగా షేవ్ చేసిన స్టైల్‌తో అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్ 2024లో పొడవాటి హెయిర్‌స్టైల్, ఫుల్ బీర్డ్‌తో రెట్రో లుక్‌ను చూపించాడు. ఇప్పుడు బ్లాండ్ షార్ట్ హెయిర్‌తో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.

45
పాండ్యా హెయిర్ స్టైల్ పై ఫ్యాన్స్ కామెంట్స్

హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త లుక్ పోస్ట్ చేసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించారు. కొందరు ఆయన లుక్‌ను ప్రశంసిస్తే, మరికొందరు సరదా మీమ్స్‌తో స్పందించారు. ఈ కొత్త స్టైల్ ఆయనకు సూటవుతుందా కాదా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

కాగా, హార్దిక్ పాండ్యా గత రెండేళ్లుగా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2024లో టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే క్రమంలో కీలక పాత్ర పోషించాడు. 2024 నుండి ఇప్పటివరకు టి20ల్లో 22 మ్యాచ్‌లు ఆడి 464 పరుగులు సాధించాడు. రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే 21 వికెట్లు తీసి తన ఆల్‌రౌండ్ ప్రతిభను నిరూపించాడు. ఆసియా కప్ 2025లో కూడా జట్టుకు విజయాన్ని అందించాలనే లక్ష్యంతో పాండ్యా ముందుకు సాగుతున్నాడు.

55
ఆసియా కప్ 2025 భారత జట్టు, షెడ్యూల్

అబు ధాబీలో సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ అబుధాబీలో అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ మధ్య జరగనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. సెప్టెంబర్ 20 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.

• సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ

• సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్

• సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్

భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

Read more Photos on
click me!

Recommended Stories