గతంలో ఉన్నట్లుగా ఈసారి భారత్‌లో ట్రైనింగ్ క్యాంప్ జరగలేదు. ఆటగాళ్లందరినీ నేరుగా దుబాయ్‌లో ఐసీసీ అకాడమీకి పంపించారు. సెప్టెంబర్ 5 నుంచి ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమవుతుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముందే దుబాయ్ చేరుకున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముంబై నుంచి బయల్దేరనున్నారు. వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ బెంగళూరు నుంచి బయలుదేరనున్నారు.
భారత జట్టు స్క్వాడ్
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
స్టాండ్‌బై: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్.