భారత జట్టులో స్టైలిష్ క్రికెటర్ ఎవరో తెలుసా? దేశీ బాయ్ అతనే !

Published : Sep 02, 2025, 10:09 PM IST

Gautam Gambhir Rapid Fire: గౌతమ్ గంభీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లను వివిధ పదాలతో కలిపి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మరి గంభీర్ చెప్పిన స్టైలిష్ క్రికెటర్‌, దేశీ బాయ్, స్పీడ్ గన్ ఎవరో ఇపుడు తెలుసుకుందాం.

PREV
16
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్‌లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2025 ఫైనల్‌లో పాల్గొన్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా నాయకత్వంలోని వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. ఈ క్రమంలోనే జరిగిన ఇంటర్వ్యూలో గంభీర్ ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు.

DID YOU KNOW ?
ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్
గౌతమ్ గంభీర్ IPLలో 154 మ్యాచ్‌ల్లో 4217 రన్స్ చేశారు. కేకేఆర్ ను 2012, 2014లో ఛాంపియన్‌ గా నిలిపారు. ఆ తర్వాత LSG, KKR మెంటార్‌గా పనిచేశారు, 2024లో KKRను మరోసారి ట్రోఫీని గెలిపించారు. IPLలో కెప్టెన్, మెంటార్‌గా తనదైన ముద్ర వేశారు.
26
రాపిడ్ ఫైర్ రౌండ్ లో గౌతమ్ గంభీర్ ఆసక్తికర సమాధానాలు

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ సందర్భంగా నిర్వహించిన రాపిడ్ ఫైర్ రౌండ్‌లో ప్రెజెంటర్లు కొన్ని పదాలను చెప్పి, వాటికి ఎవరు కరెక్టుగా సరిపోతారో చెప్పాలని గంభీర్ ను కోరారు. గంభీర్ వెంటనే ఆ పదాలకు సంబంధిత భారత క్రికెటర్ల పేర్లను వెల్లడించారు. ప్రతి పదానికి ఆయన చెప్పిన సమాధానాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సంబంధిత వీడియోలు వైరల్ గా కూడా మారాయి.

36
శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసలు

"స్టైలిష్" అనే పదం వినగానే గంభీర్ తక్షణమే భారత టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరును సూచించారు. అతనే మోస్ట్ స్టైలిష్ అని తెలిపారు. అలాగే, విరాట్ కోహ్లీని "దేశీ బాయ్"గా, రిషబ్ పంత్‌ను "ఫన్నీయెస్ట్, ఆల్వేస్ లేట్"గా పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్‌ను "క్లచ్ ప్లేయర్"గా, రాహుల్ ద్రావిడ్‌ను "మిస్టర్ కన్సిస్టెంట్"గా అభివర్ణించారు.

46
గౌతమ్ గంభీర్ రాపిడ్ ఫైర్ లో ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఇవే
  • Desi Boy: విరాట్ కోహ్లీ
  • Clutch: సచిన్ టెండూల్కర్
  • Speed: జస్ప్రిత్ బుమ్రా
  • Golden Arm: నితీశ్ రాణా
  • Most Stylish: శుభ్‌మన్ గిల్
  • Run Machine: వీవీఎస్ లక్ష్మణ్
  • Mr Consistent: రాహుల్ ద్రావిడ్
  • Funniest: రిషబ్ పంత్
  • Death Over Specialist: జహీర్ ఖాన్
56
గంభీర్ భారత జట్టు కోచ్‌గా ఒక సంవత్సరం పూర్తి

భారత జట్టుకు గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పూర్తయింది. టెస్ట్ క్రికెట్‌లో భారత్ 15 మ్యాచ్‌లలో కేవలం ఐదు విజయాలు మాత్రమే సాధించింది. 8 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా, 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే, టీ20 క్రికెట్‌లో మాత్రం భారత్ దాదాపు అజేయంగా కొనసాగుతోంది. గంభీర్ కోచింగ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.

66
ఆసియా కప్ 2025 తో గంభీర్‌కు కొత్త సవాలు

ఒక నెల విశ్రాంతి అనంతరం గంభీర్ మళ్లీ భారత జట్టుతో కలిశారు. ఇప్పుడు గంభీర్ ముందు కొత్త సవాలు వచ్చి చేరింది. అదే ఆసియా కప్ 2025. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. మరోసారి జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాల్సిన బాధ్యత ఆయన పై ఉంది.

ఈ టోర్నీ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యుఏఈలో జరగనుంది. ఆసియా కప్ 2025లో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 9న దుబాయ్‌లో యుఏఈతో ఆడనుంది. సెప్టెంబర్ 14న అదే వేదికపై భారత్-పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఈ టోర్నమెంట్ భారత్‌కు కీలక పరీక్ష కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories