Team India : డ్రీమ్11 వెనక్కి తగ్గడంతో బీసీసీఐ భారత జట్టుకు కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు ఆహ్వానించింది. రూ.300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే అర్హత ఉంటుందని పలు కండీషన్లు పెట్టింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి స్పాన్సర్‌షిప్ మార్పుకు సిద్ధమైంది. అన్ లైన్ గేమింగ్ పై ప్రభుత్వం ఇటీవలే చట్టం తీసుకురావడంతో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11 తన ఒప్పందాన్ని బీసీసీఐతో ముందుగానే ముగించుకుంది. 2025లో అమల్లోకి వచ్చిన కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం రియల్ మనీ గేమింగ్ కంపెనీలకు క్రీడా ఈవెంట్ల స్పాన్సర్‌షిప్‌ను నిషేధించింది.
అలాగే, మనీ సంబంధిత అన్ని అన్ లైన్ గేమ్స్ పై నిషేధం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ 2025 సమీపిస్తున్న తరుణంలో, బీసీసీఐ వెంటనే కొత్త స్పాన్సర్ కోసం టెండర్ విడుదల చేసింది.
DID YOU KNOW ?
బీసీసీఐ ఏర్పాటు
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) డిసెంబర్ 1928లో ఏర్పడింది. భారత క్రికెట్‌ను నిర్వహించేందుకు మద్రాస్‌లోని (ప్రస్తుత చెన్నై) ఒక సమావేశంలో దీనిని స్థాపించారు. దీనికి రిజిస్ట్రేషన్ జనవరి 1929లో జరిగింది.
26
టీమిండియా కొత్త స్పాన్సర్ - టెండర్ షరతులు మరింత కఠినం
టీమిండియా కొత్త స్పాన్సర్ కోసం మంగళవారం (సెప్టెంబర్ 2న) బీసీసీఐ ఇన్విటేషన్ ఫర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (IEOI) విడుదల చేసింది. అయితే ఈ సారి షరతులు కఠినంగా ఉన్నాయి. కనీసం మూడు సంవత్సరాలుగా రూ.300 కోట్ల టర్నోవర్ లేదా నికర విలువ చూపించగలిగిన సంస్థలకే అర్హత ఉంటుంది. అలాగే నేర చరిత్ర, ఆర్థిక వివాదాలు లేదా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఉన్న సంస్థలను తిరస్కరించే హక్కు బోర్డుకే ఉంటుందని స్పష్టంచేసింది.
36
షరతులలో పలు నిషేధిత కేటగిరీలు
బీసీసీఐ స్పాన్సర్‌గా బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ మనీ గేమింగ్, క్రిప్టోకరెన్సీ, పొగాకు, మద్యం రంగాలకు చెందిన కంపెనీలు అర్హులు కావు. ఇదే కాకుండా ప్రాక్సీ బ్రాండ్ల ద్వారా దరఖాస్తులు పంపడం కూడా అనుమతిలేదు.
టెండర్ డాక్యుమెంట్ పొందడానికి రూ.5 లక్షల (జీఎస్టీతో కలిపి) చెల్లించాలి. ఆసక్తి గల సంస్థలు సెప్టెంబర్ 12లోపు బిడ్ డాక్యుమెంట్ కొనుగోలు చేయాలి. తుది దరఖాస్తు సెప్టెంబర్ 16లోపు సమర్పించాలి. ఈ షెడ్యూల్ ప్రకారం, బోర్డుకు కొత్త స్పాన్సర్‌ను ఫైనల్ చేసే సమయం తక్కువే. ఆలస్యం జరిగితే, ఆసియా కప్‌లో భారత జట్టు స్పాన్సర్ లేకుండా ఆడే అవకాశం కూడా ఉంది.
56
డ్రీమ్11 ఒప్పందం రద్దు
డ్రీమ్11 బీసీసీఐతో 2023లో 358 కోట్ల రూపాయల (సుమారు US$44 మిలియన్) విలువైన ఒప్పందం చేసుకుంది. ఇది 2026 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే కొత్త చట్టం వల్ల ఇది ముందుగానే ముగిసింది.
డ్రీమ్11, మై11సర్కిల్ అనే మరో ఫాంటసీ ప్లాట్‌ఫామ్ కలిసి అన్ని ఒప్పందాలతో ఇప్పటి వరకు దాదాపు రూ.1000 కోట్లు బీసీసీఐకి అందించాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
66
భారత క్రికెట్ స్పాన్సర్‌షిప్‌లో మారుతున్న దృశ్యం
ఈ పరిణామం భారత క్రికెట్‌లో స్పాన్సర్‌షిప్ డైనమిక్స్ ఎంత వేగంగా మారుతున్నాయో చూపిస్తుంది. డ్రీమ్11 వెనక్కితగ్గడంతో ఫాంటసీ స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌కు ముగింపు కార్డు పడింది. అదే సమయంలో పెద్ద బ్రాండ్లకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి.
టీమిండియాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా, ప్రధాన స్పాన్సర్ హక్కులు ఇప్పటికీ అత్యంత కోవేటెడ్ మార్కెటింగ్ స్లాట్ గా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో టీమిండియా కొత్త స్పాన్సర్ ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది.