India vs England: 10 ఏళ్ల తర్వాత భారత్ చెత్త రికార్డు

Published : Jul 25, 2025, 11:43 PM IST

India vs England: మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమాయానికి ఇంగ్లాండ్ 544/7 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే భారత్ చెత్త రికార్డు నమోదుచేసింది.

PREV
15
మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ జోరు.. డెఫెన్స్ లో భారత్

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ భారత్ పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. మూడవ రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ 544/7 పరుగులతో నిలిచింది. జాక్ క్రాలీ (Zak Crawley), బెన్ డకెట్ (Ben Duckett) 166 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఇస్తూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు.

ఆ తర్వాత సీనియర్ స్టార్ ప్లేయర్ జో రూట్ (Joe Root) అద్భుతమైన 150 పరుగుల నాక్ తో ఇంగ్లాండ్ 500 పరుగుల మార్కును దాటింది. రవీంద్ర జడేజా (Ravindra Jadeja), తొలి మ్యాచ్ ఆడుతున్న అంషుల్ కంబోజ్ (Anshul Kamboj) ఓపెన‌ర్ జోడీని ఛేదించినప్పటికీ, ఇంగ్లాండ్ ఆటపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది.

25
చరిత్ర సృష్టించిన జో రూట్

జో రూట్ తన టెస్టు కెరీర్‌లో 38వ సెంచరీతో దుమ్మురేపాడు. అలాగే, భారత్‌పై హోం టెస్టుల్లో 9 సెంచరీలతో డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును అధిగమించాడు. అతను 150 పరుగులతో ఔటయ్యే వరకు భారత బౌలర్లు ఎలాంటి ప్రతిఘటన చూపలేకపోయారు. ఈ ఇన్నింగ్స్‌తో రూట్ టెస్టు చరిత్రలో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు (13379*). అలాగే, రికీ పాంటింగ్‌ను అధిగమించాడు.

35
10 ఏళ్ల తరువాత ఓవర్సీస్ టెస్టులో 500+ పరుగులు

2015 (సిడ్నీ టెస్ట్) తర్వాత భారత్ ఓవర్సీస్‌లో ఒక‌ టెస్టులో 500 పరుగులు స‌మ‌ర్పించుకున్న చెత్త రికార్డును న‌మోదుచేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ ఈ స్థాయిలో ప‌రుగులు ఇవ్వ‌లేదు. ఇది ఇంగ్లాండ్ చేతిలో మూడవసారి కావ‌డం గ‌మ‌నార్హం. అంత‌కుముందు, 2016 రాజ్‌కోట్ (537 ప‌రుగులు), 2021 చెన్నై (578 ప‌రుగులు), ఇప్పుడు మాంచెస్ట‌ర్ లో 500 పైగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 544/7 ప‌రుగులు చేసింది.

45
భారత బౌలింగ్ విభాగం నిరాశపరిచింది

బుమ్రా (Jasprit Bumrah) ఈ టెస్టులో 173 బంతుల్లో కేవలం 1 వికెట్ మాత్రమే తీసి నిరాశపరిచాడు. ఇతర బౌలర్లు కూడా ప్ర‌భావం చూపించ‌లేకపోచారు. ర‌వీంద్ర జ‌డేజా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ (Mohammed Siraj) 26 ఓవర్లలో 1 వికెట్ తీసి 113 పరుగులు ఇచ్చాడు.

55
భారత జట్టు ముందు పెద్ద‌ పరీక్ష

ప్ర‌స్తుత పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టుకు మిగిలిన రెండు రోజుల్లో మ్యాచును నిలబెట్టుకోవాలంటే గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. సిరీస్ కోణంలో కీలకమైన ఈ మ్యాచ్ భారత్‌కు క్లిష్టమైన సవాలుగా మారింది. భారత బ్యాటింగ్ ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుందన్నది కీల‌కంగా మార‌నుంది.

Read more Photos on
click me!

Recommended Stories