Yash Dayal: క్రికెటర్ యశ్ దయాల్‌పై మరో కేసు

Published : Jul 25, 2025, 06:07 PM IST

Yash Dayal: రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) బౌలర్ యశ్ దయాల్‌పై జైపూర్‌లో కేసు నమోదైంది. పోక్సో చ‌ట్టం కింద అత‌నిపై విచారణ కొనసాగుతోంది.

PREV
15
జైపూర్‌లో యశ్ దయాల్‌పై జైపూర్ మ‌రో కేసు

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేస్ బౌలర్ యశ్ దయాల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. జైపూర్ నగరంలో ఆయనపై అత్యాచారం ఆరోపణలతో కేసు నమోదైంది.

17 ఏళ్ల బాలికపై ఐపీఎల్ 2025 సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో ఘ‌జియాబాద్‌లో ఇప్పటికే మరో లైంగిక దాడి కేసులో ఆయనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ తాజా కేసు ఆయనకు షాక్ అని చెప్పాలి.

25
రెండేళ్లుగా లైంగికదాడి అంటూ బాధితురాలి ఆరోపణలు

బాధితురాలు ఇద్దరి మధ్య పరిచయం క్రికెట్ ద్వారా ఏర్పడింది. యశ్ దయాల్ తనను ప్రొఫెషనల్ క్రికెట్‌లో ప్రోత్సహిస్తానని నమ్మించి, గత రెండేళ్లుగా శారీరక సంబంధాలను బలవంతంగా కొనసాగించాడని ఆరోపించింది. బాధితురాలు అప్పట్లో 17 ఏళ్ల మైనర్ కావడంతో, ఇది POCSO చట్టం పరిధిలోకి వస్తుంద‌ని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

35
హోటల్‌లో పిలిచి బలవంతం చేసినట్లు ఆరోపణలు

జైపూర్‌లో ఐపీఎల్ 2025 సందర్భంగా జరిగిన రాజస్థాన్ రాయ‌ల్స్ (RR) వర్సెస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) మ్యాచ్ సందర్భంగా, యశ్ దయాల్ సీతాపుర ప్రాంతంలోని హోటల్‌కు పిలిచి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డార‌ని బాధితురాలు ఆరోపించింద‌ని పోలీసులు తెలిపారు. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా బాధితురాలిని వాడుకున్నట్లు పేర్కొన్నారు.

45
కొన‌సాగుతున్న పోలీస్ విచారణ.. POCSO చట్టం కింద కేసు నమోదు

జైపూర్‌లోని సాంగానేర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా 2025 జూలై 23న ఎఫ్ఐఆర్ నమోదైంది. స్టేషన్ హెడ్ అధికారి (SHO) అనిల్ జైమన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది మైనర్‌పై అత్యాచారం కేసుగా నమోదు అయింది. ఈ కేసు కింద యశ్ దయాల్‌పై 2012 POCSO చట్టం ప్రకారం కఠినంగా విచారణ సాగనుందన్నారు.

55
గత కేసులతో కలిపి తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం

యశ్ దయాల్ ఇప్పటికే ఘ‌జియాబాద్ మహిళ ఫిర్యాదులోనూ లైంగిక వేధింపుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా జైపూర్ కేసు వెలుగులోకి రావడంతో ఆయనపై ఆరోపణలు మరింత బలంగా మారాయి. 

POCSO చట్టం కింద యశ్ దయాల్ దోషిగా తేలితే, ఆయనకు దీర్ఘకాల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కేసుల నేపథ్యంలో యశ్ దయాల్ క్రికెట్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.

ఈ కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories