Rishabh Pant: రిషబ్ పంత్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ

Published : Jul 24, 2025, 04:46 PM IST

Rishabh Pant: ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ లో నాల్గో టెస్టులో భారత్ తలపడుతోంది. మొదటి రోజు గాయంతో గ్రౌండ్ ను వీడిన రిషబ్ పంత్ పై బీసీసీఐ బిగ్ అప్డేట్ ఇచ్చింది.

PREV
15
రిష‌బ్ పంత్ కు గాయం

మంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ నాల్గో టెస్టులో మొద‌టి రోజు రిష‌బ్ పంత్ గాయ‌ప‌డ్డారు. గాయం తీవ్రంగా ఉండ‌టంతో మ్యాచ్ మ‌ధ్య‌లోనే క్రీజును వ‌దిలి వెళ్లారు. ఆ త‌ర్వాత చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వైద్య ప‌రీక్ష‌ల త‌ర్వాత పంత్ కాలు వేలి ఎముక‌లో క్రాక్ వ‌చ్చిన‌ట్టు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే పంత్ కు ఆరు నెల‌ల విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించార‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అత‌ని స్థాన‌లో మ‌రో ప్లేయ‌ర్ జ‌ట్టులోకి వ‌స్తార‌నే రిపోర్టుల మ‌ధ్య పంత్ గాయంపై భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అప్డేట్ ఇచ్చింది.

25
రిష‌బ్ పంత్ స్థానంలో కీపింగ్ చేయ‌నున్న ధ్రువ్ జురేల్

మాంచెస్ట‌ర్ టెస్ట్‌లో గాయపడ్డ రిషబ్ పంత్ ఇక మిగతా మ్యాచ్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టరని బీసీసీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది. అతని స్థానంలో యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ మిగతా మ్యాచ్‌లో కీపింగ్ చేస్తాడ‌ని వెల్ల‌డించింది.

35
పంత్ కు గాయం ఏలా అయింది?

మాంచెస్ట‌ర్ టెస్టు తొలి రోజున పంత్ కు గాయం అయింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు పంత్. అయితే, బంతి బ్యాట్ ను కాకుండా నేరుగా రిష‌బ్ పంత్ కాలును తాకింది. టోపై తాకి తీవ్ర‌ గాయమైంది. స్కాన్ రిపోర్ట్‌లో టో ఫ్రాక్చర్‌గా తేలింది. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు.

45
మాంచెస్ట‌ర్ లో రిష‌బ్ పంత్ బ్యాటింగ్ చేయ‌డానికి గ్రౌండ్ కు వ‌స్తారా?

కాగా, గాయం అయిన‌ప్ప‌టికీ నాల్గో టెస్టులో రిష‌బ్ పంత్ కొన‌సాగుతార‌ని బీసీసీఐ తెలిపింది. అత‌ను కీపింగ్ చేయ‌డు కానీ, బ్యాటింగ్ చేయ‌డానికి వ‌స్తారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అతను బ్యాటింగ్‌కి అందుబాటులో ఉన్నాడు. "పంత్ కీపింగ్ చేయలేడు కానీ, పరిస్థితి అనుకూలంగా ఉంటే బ్యాటింగ్ చేస్తాడు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

55
పంత్ గాయంతో ధ్రువ్ జురేల్‌కు ఛాన్స్

ఇంగ్లాండ్ సిరీస్ కోసం భార‌త జ‌ట్టులో యంగ్ ప్లేయ‌ర్ ధ్రువ్ జురేల్ కూడా ఉన్నారు. గ‌త టెస్టులో పంత్ గాయ‌ప‌డిన‌ప్పుడు జురేల్ కొంత స‌మ‌యం అత‌ని స్థానంలో కీపింగ్ చేయ‌డానికి వ‌చ్చాడు. ఇప్పుడు మాంచెస్ట‌ర్ లో పంత్ గాయంతో, అతనికి ప్రత్యక్షంగా బాధ్యతలు అప్పగించారు. ఇది జురేల్‌కు తన ప్రతిభ చూపించేందుకు మంచి అవకాశం.

కాగా, బీసీసీఐ వైద్య బృందం పంత్ గాయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం అతను నడవడానికి కొంత సహాయం అవసరమవుతుండగా, బ్యాటింగ్ చేసే అంశంపై జట్టు నిర్ణయం తీసుకుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories