Dinesh Karthik: ఇటీల టెస్ట్ మ్యాచుల్లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. దీనిపై తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ దినేష్ కార్తీక్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో భారత టెస్ట్ క్రికెట్ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. గువహటి టెస్ట్‌లో దక్షిణాఫ్రికాతో ఓడి, 12 నెలల్లో భారత్ రెండోసారి వైట్‌వాష్ అయ్యింది. గత సంవత్సరం న్యూజీలాండ్ 3-0తో గెలిచింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా సైతం 2-0తో సిరీస్ గెలుచుకుంది. దీనిపై దినేష్ కార్తీక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారత్‌లో టెస్ట్ ఆడటానికి జట్లు భయపడేవని, ఇప్పుడు అయితే “ఇక్కడికొస్తే సిరీస్ గెలవొచ్చు” అనే స్థాయికి మారిపోయిందన్నారు.
24
అసలు సమస్య ఏంటి.?
ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోలో కార్తీక్ కొన్ని ప్రశ్నలను సంధించారు. భారత్‌లోనే మా పేసర్లు, స్పిన్నర్లు అవుట్‌బౌల్డ్ అవుతున్నారు. ఎక్కువమంది ఆల్‌రౌండర్లను ప్లే చేయడం జట్టుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అని ప్రశ్నించారు. నామినేటెడ్ పేస్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ రెడ్డి దేశీయ సీజన్ మొత్తం కలిపి కేవలం 14 ఓవర్లు మాత్రమే వేశాడన్న కార్తీక్.. ఈ సిరీస్‌లో భారత జట్టు తరఫున సెంచరీ చేసిన వారు ఇద్దరే ఉండగా, దక్షిణాఫ్రికా జట్టులో ఏడుగురు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “మనం అంత చెడ్డ జట్టు కాదు… కానీ ఇలా ఒక్కసారిగా ఎందుకు పడిపోయాం?” అని ఆయన ప్రశ్నించారు.
34
నంబర్ 3 స్థానంలో గందరగోళం
భారత జట్టులో నంబర్ 3 స్థానంలో స్థిరత లేకపోవడం మరో పెద్ద లోపమని కార్తీక్ అన్నారు. WTC సైకిల్‌లో మొత్తం 65 టెస్టులలో.. భారత నంబర్ 3 ఆటగాళ్ల 1వ ఇన్నింగ్స్ సగటు కేవలం 26 మాత్రమే. ఇది అన్ని జట్లలో రెండో చెత్త రికార్డు అని అన్నారు. కోల్‌కతాలో వాషింగ్టన్ సుందర్ 3వ స్థానంలో ఆడితే, గౌహతిలో సాయి సుధర్షన్ ఆ పాత్ర పోషించారు. “ఇలా తరచుగా మార్పులు చేస్తే జట్టుకు స్థిరత ఎలా వస్తుంది?” అని కార్తీక్ ప్రశ్నించారు.
కార్తీక్ అభిప్రాయం ప్రకారం, ఈ WTC సైకిల్‌లో భారత్‌కు అవకాశాలు చాలా తక్కువ అని కార్తీక్ అభిప్రాయపడ్డారు. శ్రీలంకలో 2 టెస్టులు, న్యూజీలాండ్‌లో 2 టెస్టులు, ఆస్ట్రేలియా భారత్ పర్యటనలో 5 టెస్టులు ఉన్నాయి. ఇలా సవాళ్లతో కూడిన షెడ్యూల్ ఉండటంతో జట్టు మరింత సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.