భారత్ Super 8 కి చేరితే మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, కొలకతాలో నిర్వహిస్తారు. ఇక సెమీ ఫైనల్ ముంబైలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్‌కు వెళ్తే మ్యాచ్ కొలంబోలో నిర్వహిస్తారు.
పాల్గొనే జట్లు & డిఫెండింగ్ ఛాంపియన్
హోస్ట్ దేశాలైన భారత్, శ్రీలంక తో పాటు మొత్తం 20 దేశాలు ఆడుతున్నాయి. అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, USA, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమాన్, UAE ఈ సిరీస్‌లో ఆడనున్నాయి. కాగా భారత్ 2024 T20 వరల్డ్ కప్ చాంపియన్, ఆ సమయంలో ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే.