Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఐఐటీ బాబా జోస్యం తప్పని తేలింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది.
IND vs PAK Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన ఐదో మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ తలపడ్డాయి. పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు కేవలం 42.3 ఓవర్లలోనే విజయం సాధించింది.
రన్ మిషన్ విరాట్ కోహ్లీ 100 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడి చివరి వరకు క్రీజులో ఉండి భారత్ కు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు ఈ టోర్నమెంట్ నుండి దాదాపు ఔట్ అయింది. దీంతో ఐఐటీ బాబాను ఆటాడుకుంటున్నారు.
భారత్ జట్టు పాకిస్తాన్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ కు ముందు భారత్ ఓడిపోతుందని అంచనాలు వేసిన వారిని సోషల్ మీడియా వేదికగా ఆడాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారత్ పక్కా ఓడిపోతుందంటూ సంచలనం రేపిన ఐఐటీ బాబాను చెడుగుడు ఆడుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఐఐటీ బాబాను టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారు. మ్యాచ్ లో భారత్ గెలిచిన వెంటనే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఐఐటీ బాబా జోస్యం కూడా తలకిందులు కావడంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు.
34
IND vs PAK Champions Trophy 2025 IIT Baba
ట్రోల్స్ , మీమ్స్ తో ఐఐటీ బాబాకు చుక్కలు చూపిస్తున్నారు !
మ్యాచ్‌కు ముందు ఐఐటీ బాబా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ కూడా పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేడంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే, మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా సీన్ రివర్స్ అయింది.
భారత్ దుమ్మురేపింది. విరాట్ కోహ్లీ పాకిస్తాన్ ను దంచికొట్టాడు. సెంచరీతో భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ సెమీస్ కూడా చేరింది. దీంతో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. ఐఐటీ బాబాను ఓ ఆట ఆడుకుంటున్నారు.
44
IND vs PAK Champions Trophy 2025 IIT Baba
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో ఐఐటీ బాబా చెప్పింది జరగలేదు. దీంతో నెటిజన్లకు టార్గెట్ గా మారాడు. ట్వీట్లతో ఐఐటీ బాబాను ఆటాడుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలింగ్ ను దంచికొట్టాడు.
విరాట్ కోహ్లీ 100 పరుగుల అజేయ సెంచరీతో భారత్ కు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ భారత్ ముందుంచిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ 42.3 ఓవర్లలోనే అందుకున్నారు.