Champions Trophy: పాకిస్తాన్ ను రఫ్ఫాడించాడు ! కింగ్ కోహ్లీ సెంచరీ నంబర్ 82

Published : Feb 23, 2025, 10:49 PM ISTUpdated : Feb 24, 2025, 09:17 AM IST

ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ సెంచరీతో దుమ్మురేపాడు.  పాకిస్తాన్ ను దంచికొడుతూ 82వ సెంచరీతో భారత్ కు విజయాన్ని అందించాడు. 

PREV
14
Champions Trophy: పాకిస్తాన్ ను రఫ్ఫాడించాడు ! కింగ్ కోహ్లీ సెంచరీ నంబర్ 82
Virat Kohli vs Pakistan

ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో సెంచ‌రీ కొట్టాడు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థిపై విజ‌యం సాధించడంలో కీల‌క పాత్ర పోషించాడు. భార‌త్ కు విన్నింగ్ ర‌న్స్ అందించ‌డంతో పాటు అదే ప‌రుగుతో త‌న సెంచ‌రీని పూర్తి చేశాడు.

కోట్లాది మంది భారతీయుల హృదయాల‌ను మ‌రోసారి కొల్ల‌గొట్టాడు. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో, విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టి త‌న సెంచ‌రీతో పాటు భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ బ్యాట్ నుండి వ‌చ్చిన 82వ సెంచరీ ఇది. తన ఫామ్‌ను విమర్శించిన వారికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో విరాట్ కోహ్లీ  త‌న బ్యాట్ తో స‌మాధాన‌మిచ్చాడు.
 

24
champions trophy 2025: century number 82, virat kohli's lion roar against pakistan in dubai ind vs pak in

పాకిస్థాన్ పై భారత్ గెలుపు 

కోహ్లీ 100 పరుగుల అజేయ సెంచ‌రీతో పాకిస్తాన్ పై భార‌త జ‌ట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ భారీగా ప‌రుగులు చేయ‌కుండా కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు కీల‌క పాత్ర పోషించారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మాన్ గిల్ లు హాఫ్ సెంచ‌రీలు సాధించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 42.3 ఓవర్లలో 244 పరుగులు చేసి విజయం సాధించింది.

34
champions trophy 2025: century number 82, virat kohli's lion roar against pakistan in dubai ind vs pak in

పాక్ పై విరాట్ గ‌ర్జ‌న 

భారత జ‌ట్టుకు మంచి భాగస్వామ్యం అవసరమైనప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చాడు. రోహిత్ శర్మ 20 పరుగులు చేసి ఔటవ్వడంతో భారత్ 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సెంచరీ సాధించాలనే దృఢ సంకల్పంతో వచ్చినట్లుగా విరాట్ కోహ్లీ క్రీజులోకి వ‌చ్చి నిల‌దొక్కుకున్నాడు. 

మొదట శుభ్‌మాన్ గిల్ (46)తో హాఫ్ సెంచ‌రీ భాగస్వామ్యాన్ని, త‌ర్వాత శ్రేయాస్ అయ్యర్ (56)తో 100 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్ప‌ర‌చి భారత్‌ను విజయపథంలో నడిపించాడు. కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించాలనే తన కలను కూడా నెరవేర్చుకున్నాడు.

44
champions trophy 2025: century number 82, virat kohli's lion roar against pakistan in dubai ind vs pak in

వన్డే ఫార్మాట్‌లో  కింగ్ కోహ్లీ 

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ సాధించిన ఈ సెంచ‌రీ 51వ వన్డే సెంచరీ. ఈ సెంచరీతో వ‌న్డే క్రికెట్ లో తాను కింగ్ అని నిరూపించుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ కోహ్లీనే. పాకిస్థాన్‌పై వన్డే క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఇది 4వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ అత్య‌ధిక వ‌న్డే సెంచ‌రీల రికార్డును ఇప్ప‌టికే కోహ్లీ బ్రేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కోహ్లీ వన్డేల్లో 51 సెంచరీలు, టెస్టుల్లో 30, టీ20ల్లో ఒక సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో అతని మొత్తం సెంచరీల సంఖ్య 82కి చేరుకుంది. మొత్తంగా అన్ని ఫార్మాట్ ల‌లో క‌లిపి అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రెండో ప్లేయ‌ర్ గా కోహ్లీ నిలిచాడు. 100 సెంచ‌రీలు పూర్తి చేసిన స‌చిన్ టెండూల్క‌ర్ టాప్ లో ఉన్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories